యాక్షన్ హీరో సినిమాలో బిగ్ బీ

Thu,November 24, 2016 12:53 PM
Amitabh Bachchan guest role in akshay movie

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఏడు పదుల వయస్సులోను ఎంతో ఉత్సాహంగా సినిమాలు చేస్తున్నాడు. కేవలం ప్రధాన పాత్రలలోనే కాక స్టార్ హీరోస్ మూవీలో గెస్ట్ పాత్రలు పోషిస్తున్నాడు. మిస్టర్ పర్ ఫెక్ట్ అమీర్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న ‘థగ్స్‌ ఆఫ్‌ హిందుస్తానీ’ చిత్రంలో అమితాబ్ బచ్చన్ ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. ఇదే కాక యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ సినిమాలోను బిగ్ బీ కీలక పాత్ర పోషించనున్నాడని చెబుతున్నారు. ఈ చిత్రాన్ని ఆర్.బాల్కీ తెరకెక్కించనున్నాడు. గతంలో అక్షయ్‌, అమితాబ్ లు కలిసి ‘వక్త్‌: ది రేస్‌ అగెనెస్ట్‌ టైం’చిత్రంలో నటించారు. ఇందులో అక్షయ్ ఫాదర్ గా అమితాబ్ నటించాడు. ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం 2005లో విడుదలైంది. అక్షయ్ తో పాటు బాల్కీతో ఉన్న సాన్నిహిత్యం కారణంగా రానున్న చిత్రంలో బిగ్ బి గెస్ట్ పాత్ర పోషించేందుకు ఓకే అన్నాడని చెబుతున్నారు. అమితాబ్ ప్రస్తుతం వర్మ తెరకెక్కిస్తోన్న సర్కార్ చిత్రంతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

2201
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles