థ‌గ్స్ ఆఫ్ హిందూస్థాన్ నుండి అమితాబ్ లుక్ అవుట్‌

Tue,September 18, 2018 11:39 AM
Amitabh Bachchan first look out

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చ‌న్ , స్టార్ హీరో అమీర్ ఖాన్‌, దంగల్ భామ ఫాతిమా సనా ఖాన్ , గ్లామ‌ర్ బ్యూటీ క‌త్రినా కైఫ్‌, స్టార్ యాక్ట‌ర్ జాకీ ష్రాఫ్ ముఖ్య పాత్ర‌లలో తెర‌కెక్కుతున్న చిత్రం థ‌గ్స్ ఆఫ్ హిందూస్థాన్‌. విజయ్ కృష్ణ ఆచార్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం న‌వంబ‌ర్ 8న‌ విడుద‌ల కానుంది. 19వ శతాబ్దంలో బ్రిటిష్ పాలనలో ఇండియా నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కింది. 1839లో ఫిలిప్ మీడోస్ టేలర్ రాసిన కన్ఫెషన్స్ ఆఫ్ ఎ థగ్ అనే నవల స్ఫూర్తితో సినిమాను రూపొందించారు. దేశంలో ఓ దోపిడీదారు, అతని గ్యాంగ్ కలిసి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా చేసిన ఉద్యమం ప్రధాన కథాంశంగా థగ్స్ ఆఫ్ హిందుస్థాన్‌ను తెరకెక్కించారు. . థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ 3డీ, ఐమ్యాక్స్ ఫార్మాట్లలో హిందీతోపాటు తమిళ్, తెలుగులలో రిలీజ్ కానుంది. నిన్న చిత్ర మోష‌న్ పోస్ట‌ర్ ని విడుద‌ల చేసిన చిత్ర బృందం తాజాగా థ‌గ్స్ ఆఫ్ హిందూస్థాన్ మూవీ నుండి అమితాబ్ లుక్ విడుద‌ల చేసింది. ఖుదాబ‌క్ష్ పాత్ర‌లో వ‌యోధుకుడి లుక్ అందరిని ఆక‌ట్టుకుంటుంది. అమితాబ్ తెలుగులో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కుతున్న సైరా చిత్రంలో రాజ‌గురువు పాత్ర పోషిస్తున్న సంగ‌తి తెలిసిందే.

1583
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles