హాఫ్ సెంచ‌రీ కొట్టిన అమితాబ్ బ‌చ్చ‌న్‌

Fri,February 15, 2019 01:38 PM
Amitabh Bachchan completes 50 Years in industry

అమితాబ్ బ‌చ్చ‌న్‌.. ఈ పేరుకి ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. రాష్ట్రం, దేశంలోనే కాకుండా ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న ఎంద‌రినో త‌న అభిమానులుగా మ‌లుచుకున్న స్టార్ అమితాబ్‌. బిగ్ బీ, బాలీవుడ్ మెగాస్టార్ అని ఆయ‌న‌ని అభిమానులు ముద్దుగా పిలుచుకుంటున్నారు. 76 ఏళ్ళ వ‌య‌స్సులోను కుర్ర హీరోల‌తో పోటీ ప‌డుతూ సినిమాలు చేస్తున్న అమితాబ్ చిత్ర ప‌రిశ్ర‌మ‌లోకి అడుగుపెట్టి 50 ఏళ్ళు అవుతుంది. ఆయ‌న న‌టించిన తొలి సినిమా సాథ్ హిందూస్థానీ చిత్రం 1969 ఫిబ్ర‌వ‌రి 15న మొదలైంది. ఆ రోజు ఇండ‌స్ట్రీలో తొలి అడుగు పెట్టిన అమితాబ్ నేటి వ‌ర‌కు వెన‌క్కి తిరిగి చూసుకోలేదు. త‌న పేరిట ఎన్నో రికార్డుల‌ని న‌మోదు చేసుకున్నాడు. విభిన్న పాత్ర‌ల‌లో నటిస్తూ అశేష అభిమానాన్ని పొందాడు. భాష‌తో సంబంధం లేకుండా అనేక సినిమాలు చేసిన బిగ్‌బీ ఇండ‌స్ట్రీలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న క్ర‌మంలో సెల‌బ్రిటీల నుండి శుభాకాంక్ష‌లు వెల్లువెత్తుతున్నాయి.

అమితాబ్ బ‌చ్చ‌న్ సినిమాలోకి అడుగుపెట్టి 50 ఏళ్ళు పూర్తైన సంద‌ర్భంగా ఆయ‌న త‌న‌యుడు అభిషేక్ బ‌చ్చ‌న్.. త‌న తండ్రి ఫోటో ఉన్న టీ ష‌ర్ట్ తో దిగిన ఫోటోని ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టి కామెంట్ పెట్టాడు. నా తండ్రి, బెస్ట్ ఫ్రెండ్, గైడ్, బెస్ట్ క్రిటిక్‌, హీరో. స‌రిగ్గా రోజు ఆయ‌న త‌న సినిమా ప్ర‌యాణం మొద‌లు పెట్టారు. ఈ రోజుకి ఆయ‌న త‌న ప‌ని ప‌ట్ల చూపిస్తున్న ప్రేమ‌, నిబ‌ద్ధ‌త ఎంతో గొప్పది. నీకోసం మరో 50 ఏళ్లు ఏం రాసిపెట్టుందో తెలుసుకోవడానికి ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నాం. ఈ రోజు ఉద‌యం ఆయ‌న‌కి విష్ చేద్దామ‌ని నాన్న రూంకి వెళ్ళ‌గా, బ‌య‌టికి వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. ఎక్క‌డికి వెళుతున్నారు అని అడ‌గ‌గా ‘పనిచేయడానికి’ అని సమాధానం ఇచ్చారు’ అని అభిషేక్ తెలిపారు. త‌న కూతురు శ్వేతా బ‌చ్చ‌న్ నందా కూడా త‌న తండ్రికి సోష‌ల్ మీడియా ద్వారా శుభాకాంక్ష‌లు తెలిపింది. అమితాబ్ ప్ర‌స్తుతం ‘బ్రహ్మాస్త్ర’, ‘బద్లా’ చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఆయ‌న తెలుగులో సైరా అనే చిత్రంలో రాజ‌గురువు పాత్ర‌లో న‌టించిన విష‌యం విదిత‌మే.

View this post on Instagram

ICON! To me, he's so much more. My father, best friend, guide, best critic, greatest support, idol..... HERO! 50 years today he started his journey in films. Even today, his passion and love for his craft and work is the same as I'm sure it was on the first day. Dearest Pa, today we celebrate you, your talent, your passion, your brilliance and your immense influence. Can't wait to see what you have in store for the next 50 years. The coolest thing he taught me today.... As I went, in the morning to wish him for completing 50 years of being an actor and to tell him that I was leaving for work- I asked him where he was all ready to go to? He said..... To work! 💪 . . . . #50yrsofBigB #amitabhbachchan #BigB

A post shared by Abhishek Bachchan (@bachchan) on

1358
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles