‘102 నాటౌట్’కు మెగాస్టార్ సాంగ్

Thu,February 22, 2018 03:55 PM
amitab has sung a Song for 102 Notout


ముంబై : బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్‌బచ్చన్ తన కొత్త సినిమా కోసం పాట పాడారు. ఉమేశ్ శుక్లా డైరెక్షన్‌లో రిషికపూర్, బిగ్ బీ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ‘102 నాటౌట్’. ఈ సినిమా కోసం కంపోజ్ చేసిన ‘బడుంబా’ సాంగ్‌ను పాడినట్లు బిగ్ బీ ట్విట్టర్ ద్వారా అభిమానులతో షేర్ చేసుకున్నారు. అయితే ఈ పాటకు కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య రిహార్సల్స్ చేస్తున్న సమయంలో నర్వస్‌గా ఫీలయ్యాయని ట్వీట్ చేశారు అమితాబ్. రిహార్సల్స్‌కు సంబంధించిన కొన్ని ఫొటోలను ట్విట్టర్ లో షేర్ చేశారు. తండ్రీకొడుకుల మధ్య అనుబంధాల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అమితాబ్‌బచ్చన్ 102 ఏళ్ల తండ్రి పాత్రలో కనిపించనుండగా, రిషీ కపూర్ 75 ఏళ్ల వయస్సున్న కొడుకు పాత్రలో కనిపించనున్నారు.

1943
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles