అల‌రిస్తున్న 'అఅఅ' మూవీ ట్రైల‌ర్

Sun,November 11, 2018 10:05 AM
Amar Akbar Anthony Theatrical Trailer released

శ్రీను వైట్ల‌, ర‌వితేజ కాంబినేష‌న్‌లో నీకోసం, వెంకీ, దుబాయ్ శీను వంటి చిత్రాలు తెర‌కెక్క‌గా, ఇప్పుడు వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో రూపొందిన మ‌రో చిత్రం అమ‌ర్ అక్బ‌ర్ ఆంటొని('అఅఅ') చిత్రం న‌వంబ‌ర్ 16న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. రిలీజ్‌కి మ‌రో ఐదు రోజుల స‌మ‌యం మాత్ర‌మే ఉండ‌డంతో మేక‌ర్స్ చిత్రానికి సంబంధించి జోరుగా ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్నారు. తాజాగా చిత్ర ట్రైల‌ర్ విడుద‌ల చేశారు. ఇందులో ర‌వితేజ‌.. అమ‌ర్, అక్బ‌ర్, ఆంటోని అనే మూడు పాత్ర‌ల‌లో క‌నిపించి మెప్పిస్తున్నాడు. సునీల్‌, వెన్నెల కిషోర్, త‌దిత‌రులు ఈ చిత్రంలో నటిస్తుండ‌గా, ఈ మూవీ కంప్లీట్ కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఉంటుంద‌ని అర్ధ‌మ‌వుతుంది. ఆరేళ్ల త‌ర్వాత ఇలియానా ఈ చిత్రంతో తెలుగులోకి రీ ఎంట్రీ ఇచ్చింది. మైత్రి మూవీ మేక‌ర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎస్.ఎస్.థమన్ సంగీతం అందించారు. తాజాగా విడుద‌లైన ట్రైలర్‌పై మీరు ఓ లుక్కేయండి.

2848
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles