అమ‌ర్ అక్బ‌ర్ ఆంటొని మేకింగ్ వీడియో

Sun,November 11, 2018 06:47 AM
Amar Akbar Anthony Making video

మాస్ మ‌హ‌రాజా ర‌వితేజ‌, గ్లామ‌ర్ బ్యూటీ ఇలియానా ప్ర‌ధాన పాత్ర‌ల‌లో శ్రీను వైట్ల తెర‌కెక్కించిన చిత్రం అమ‌ర్ అక్బ‌ర్ ఆంటొని. నవంబ‌ర్ 16న విడుద‌ల కానున్న ఈ చిత్రం నిన్న సాయంత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని ఘ‌నంగా జ‌రుపుకుంది. ఇక ఈ రోజు ఉద‌యం 9గం.ల‌కి చిత్ర ట్రైల‌ర్ విడుద‌ల చేయ‌నున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, మోహన్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఎస్.ఎస్.థమన్ సంగీతం అందించారు. వరస పరాజయాలతో వెనకబడిపోయిన దర్శకుడు శ్రీను వైట్ల తన లక్కీ హీరో రవితేజ మూవీతో రీఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సినిమాపై అభిమానుల‌లో చాలా కాన్ఫిడెంట్ ఉంది. అయితే సినిమాపై అభిమానుల‌లో మ‌రింత ఆస‌క్తి పెంచేందుకు ప‌లు వీడియోలు విడుద‌ల చేస్తూ వ‌స్తున్నారు. తాజాగా చిత్ర మేకింగ్ వీడియో విడుద‌ల చేశారు. ఈ వీడియో అభిమానుల‌ని ఆక‌ట్టుకుంటుది. మ‌రి మీరు చూసి ఎంజాయ్ చేయండి.

1108
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles