నెగెటివ్ రోల్‌లో అమలాపాల్..!

Mon,April 2, 2018 06:13 PM
Amalapaul to play negative role in next


హైదరబాద్ : 2011 లో బెజవాడ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది కోలీవుడ్ హీరోయిన్ అమలాపాల్. ఆ తర్వాత రఘువరన్ బీటెక్ మూవీతో మంచి సక్సెస్ అందుకుంది. మ్యారేజ్ తర్వాత కూడా సినిమాల్లో నటిస్తూ అందరికీ పోటీ ఇస్తున్న అమలాపాల్ కొత్త ప్రాజెక్టుకు సంబంధించి ఇంట్రస్టింగ్ న్యూస్ ఒకటి ఫిలింనగర్‌లో చక్కర్లు కొడుతున్నది.

అమలాపాల్ నిజార్ షఫీ డైరెక్షన్‌లో మూవీ చేసేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. అయితే ఇప్పటివరకు గ్లామర్ రోల్స్‌లో కనిపించిన అమలాపాల్, ఈ సినిమాలో నెగేటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనుందట. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కనున్న ఈ చిత్రంలో నందితాశ్వేతా, శ్రద్ధా శ్రీనాథ్, అదితి ఆర్య, అనీషా ఆంబ్రోస్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. భలే భలే మగాడివోయ్, నేను లోకల్, మహానుభావుడు చిత్రాలకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసిన నిజార్ షఫీ ఈ మూవీతో డైరెక్టర్‌గా ఎంట్రీ ఇస్తున్నాడు. ఇక అమలాపాల్ ఇప్పటికే భాస్కర్ ఒరు రాస్కెల్ మూవీతోపాటు మరో రెండు చిత్రాల్లో నటిస్తున్నది.

2209
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS