కాంట్రవర్సీగా మారిన అమలా యోగా..!

Sat,April 1, 2017 08:59 AM
amala paul yoga would be controversial

తమ అందచందాలతో యూత్ ని ఆకట్టుకునేందుకు నేటి తరం హీరోయిన్లు అనేక కసరత్తులు చేస్తున్నారు. ముఖ్యంగా కొందరు భామలు మాత్రం యోగాతో తమ గ్లామర్ ని మరింత పెంచుకుంటూ వస్తున్నారు. యోగానే ఇప్పడు వారి గ్లామర్ రహస్యానికి ఫార్ములాగా మారింది. తాజాగా అమలాపాల్ తాను యోగా చేస్తున్న కొన్ని స్టిల్స్ ని ఇన్ స్ట్రాగ్రామ్ పేజ్ లో పోస్ట్ చేసింది. ఈ పిక్స్ లో అమ్మడు చాలా హాట్ గా కనిపించింది. రకరకాల ఆసనాలు చేస్తున్న అమలాపాల్ బ్యాక్ గ్రౌండ్ లో బుద్దుడి బొమ్మ కనిపించిండం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. అందుకు కారణం తాను షేర్ చేసిన ఓ పిక్ లో బుద్దుడిపై అమల కాలు పెట్టినట్టుగా ఉండడం. ఇప్పుడు ఈ విషయం కాస్త కాంట్రవర్సీగా మారింది. భర్త నుండి విడిపోయిన తర్వాత అమలాపాల్ తమిళం, మలయాళ సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. తెలుగులోను అమలా సినిమా చేయనుందని వార్తలు వచ్చాయి. బాలయ్య ప్రధాన పాత్రలో పూరీ జగన్నాథ్ తెరకెక్కించనున్న చిత్రంలో అమలాపాల్ నే కథానాయికగా ఎంపిక చేసినట్టు ప్రచారం జరుగుతుంది. దీనిపై పూర్తి క్లారిటీ రావలసి ఉంది.

3636
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles