అమలా-విజయ్ జంటకి డైవర్స్ మంజూరు

Wed,February 22, 2017 02:10 PM
Amala Paul, Vijay divorce granted

కొన్నాళ్ళు డేటింగ్ తర్వాత జూన్ 12, 2014లో మూడు ముళ్ళ బంధంతో ఒక్కటైన అమలా పాల్- విజయ్ జంట గత ఏడాది విడిపోయిన సంగతి తెలిసిందే. ఆరు నెలల జ్యుడిషియల్ సపరేషన్ పిరియడ్ లో భాగంగా ఆగస్ట్ నుండి నుండి వీరిరివురు విడి విడిగా ఉంటున్నారు. కొన్ని మనస్పర్ధల కారణంగా విడిపోయిన ఈ జంటకి మంగళవారం నాడు చెన్నై ఫ్యామిలీ కోర్టు డైవర్స్ మంజూరు చేసింది. దీంతో వారి బంధానికి పూర్తి బ్రేక్ పడింది. ఈ విషయం తెలుసుకున్న ఇటు విజయ్ అభిమానులు, అటు అమలా పాల్ అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు. విజయ్ ఆ మధ్య ప్రభుదేవ హీరోగా దేవి అనే చిత్రం తెరకెక్కించగా ప్రస్తుతం వనమగన్ అనే చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఇక అమలా పాల్ విషయానికి వస్తే ఈ అమ్మడు హెబ్బులి, అచ్చాయన్స్, సిండరెల్లా, వడ చెన్నై,తిరుట్టు పాయలె 2, వెల్లైల్ల పట్టదారి 2 అనే చిత్రాలతో ఫుల్ బిజీగా ఉంది. విడాకుల తర్వాత అమలాపాల్ వెనుక ఆఫర్లు క్యూ కట్టాయి.

2774
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles