ఫోరెన్సిక్‌ సర్జన్‌గా అమలాపాల్‌

Tue,January 1, 2019 03:59 PM
Amala Paul to play a forensic surgeon in her next

తక్కువ సమయంలో ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్న ‘మైనా’ సుందరి అమలాపాల్ ప్రస్తుతం విభిన్న కథలపై దృష్టిపెట్టింది. కెరీర్ ఆరంభంలో గ్లామర్ పాత్రలతో మెప్పించిన అమల ప్రస్తుతం నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలతో దూసుకుపోతోంది. అభిలాష్‌ పిళ్లై రచనలో అనూప్‌ పణికర్‌ దర్శకత్వం వహిస్తున్న ఫోరెన్సిక్‌ ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌లో అమలాపాల్ నటించనుంది. ఫోరెన్సిక్‌ సర్జన్‌గా అమలాపాల్ కొత్త చిత్రంలో నటిస్తోందీ. ఈ సినిమా షూటింగ్ చెన్నై, కోవై, కోయంబత్తూరు, కేరళలోని కొన్ని ప్రాంతాల్లో జరుగనుందని సినీ వ‌ర్గాలు తెలిపాయి. ఏజీ ఫిలింస్‌, వైట్‌ స్ర్కీన్‌ మీడియా బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ వచ్చే మార్చిలో ప్రారంభంకానుంద‌ని నిర్మాత‌లు పేర్కొన్నారు.

2183
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles