సుచీ లీక్స్ పై అమలాపాల్ వ్యంగాస్త్రాలు

Fri,June 9, 2017 01:22 PM
amala paul stunning comments on suchi leaks

కొన్నాళ్ళ క్రితం తమిళ ఇండస్ట్రీలో సుచీ లీక్స్ వ్యవహరం ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రముఖ హీరో హీరోయిన్స్ కి సంబంధించిన ప్రైవేట్ వీడియోలు ఒక్కొక్కటిగా బయటకు రావడంతో తమిళ ఇండస్ట్రీ ఖంగుతింది. ఇలా కొన్ని రోజుల పాటు జరిగిన ఈ లీకేజ్ హంగామాకి బాధ్యులెవరు అనే దానిపై ఇప్పటివరకు క్లారిటీ లేదు. అయితే ఈ విషయంపై పలువురు పలు రకాలుగా స్పందించగా, మలయాళీ బ్యూటీ అమలాపాల్ మాత్రం ఇలాంటి సెన్సిటివ్ విషయంపై చాలా వ్యంగంగా స్పందిస్తూ అందరిని ఆశ్చర్య పరచింది. సుచీ లీక్స్ లో తన పేరుతో విడుదలయ్యే వీడియో చూడాలని ఎంతగానో ఎదురు చూశానన్న అమలా, ఆ ఎకౌంట్ డీయాక్టివేట్ కావడంతో చాలా బాధపడినట్టు తెలిపింది. మరి కొన్నాళ్ల పాటు అందరి గుండెల్లో దడ పుట్టించిన టాపిక్ పై అమలా పాల్ చేసిన ఈ కామెంట్స్ షాకింగ్ గా మారాయి. ఇదిలా ఉంటే
అమ‌లాపాల్ గ‌త ఏడాది ద‌ర్శ‌కుడు విజయ్ నుండి విడాకులు తీసుకున్న సంగ‌తి తెలిసిందే. ధ‌నుష్ తో చ‌నువుగా ఉన్నందువ‌ల‌న‌నే అమ‌లాపాల్ కి విజయ్ డైవ‌ర్స్ ఇచ్చిన‌ట్టు అప్ప‌ట్లో పుకార్లు షికారు చేశాయి.

1942
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles