ల‌గ్జ‌రీ కారు వివాదంపై స్పందించిన అమ‌లాపాల్‌

Thu,November 2, 2017 02:33 PM
amala paul responds on the issue of luxury car

కేర‌ళ‌లో నివ‌సిస్తూ పుదుచ్చేరిలో ఉంటున్న‌ట్టు త‌ప్పుడు చిరునామా ప‌త్రాన్ని చూపి ల‌గ్జ‌రీ కారు కొన్న‌దంటూ అమ‌లాపాల్‌పై కొద్ది రోజులుగా ప‌లు వార్త‌లు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. రూ.20 ల‌క్ష‌లు ఎగ్గొట్టి చ‌ట్ట వ్య‌తిరేఖ చ‌ర్య‌ల‌కు పాల్ప‌డిన అమ‌లాపాల్‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని పుదుచ్చేరి లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ కిర‌ణ్ బేడి ఆదేశించారు. ఈ క్ర‌మంలో అమ‌లాపాల్ తొలిసారి త‌న ట్విట్ట‌ర్ ద్వారా స్పందించింది. బోట్ రైడ్‌కి వెళ్లాల‌నుకుంటున్నా.. చ‌ట్టాన్ని వ్య‌తిరేఖించిన‌ట్టు ఆరోప‌ణ‌లు ఏమైన ఉన్నాయా , నా శ్రేయోభిలాషుల వ‌ద్ద ఇప్ప‌టికే రెండు సార్లు చెక్ చేశానంటూ అమ‌ల వ్యంగాస్త్రాలు విసిరింది. అంటే తాను ఎలాంటి త‌ప్పు చేయ‌లేద‌నే భావ‌న‌తోనే ఇలాంటి కామెంట్స్ చేసి ఉంటుంద‌ని అంటున్నారు. గ‌తంలో ప‌లువురు స్టార్ సెల‌బ్రిటీలు కూడా ఇలానే రిజిస్ట్రేష‌న్ చేయించుకున్న‌ప్ప‌టికి, వారెవ‌రి గురించి ఆరా తీయ‌ని ప్ర‌భుత్వం అమ‌లాపాల్‌పై ఎందుకు ఫోక‌స్ చేసిందా అని కోలీవుడ్‌లో జోరుగా చ‌ర్చలు జ‌రుగుతున్నాయి.. అయితే అమల ఎలాంటి నేరానికి పాల్పడలేదని పుదుచ్చేరి రెవెన్యూ, రవాణా శాఖ మంత్రి షాజహాన్‌ వెల్లడించారు. అమల కారుకు సంబంధించిన అన్ని వివరాలు సరిగ్గానే ఉన్నాయని ఆయ‌న‌ తెలిపారు.2245
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles