కేసుని ప్రక్కన పెట్టేసి, ప్రాక్టీస్ తో బిజీ బిజీ

Tue,January 30, 2018 04:25 PM
Amala Paul rehearsal for dance show

కేరళలో నివసిస్తూ పుదుచ్చేరిలో ఉంటున్నట్టు తప్పుడు చిరునామా పత్రాన్ని చూపి లగ్జరీ కారు కొన్నదన్న విషయంలో అమలాపాల్ పోలీసు స్టేషన్ వరకు వెళ్లి వచ్చిందనే ఆరోపణలు గుప్పుమన్న సంగతి తెలిసిందే. రూ.20 లక్షల పన్ను ఎగ్గొట్టి చట్ట వ్యతిరేఖ చర్యలకు పాల్పడిన అమలాపాల్పై కేరళా పోలీసులు ఇటీవల పన్ను ఎగవేత కేసుని నమోదు చేశారు. సెక్షన్ 430 - 468 - 471 సెక్షన్ల కింద క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఒకవైపు పన్ను ఎగవేత విషయంలో పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న అమలాపాల్, కేసు విషయాలని పక్కన పెట్టి భారీ ప్రోగ్రాం కోసం రిహార్సల్స్ చేస్తున్నట్టు కోలీవుడ్ మీడియా ప్రచురించింది. ఫిబ్రవరి 3వ తేదీన డాజిలింగ్ తమిళచి అంటూ ఓ భారీ ప్రోగ్రాం జరగబోతోంది. కోలీవుడ్ కి చెందిన పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరు కానుండగా.. ఇందులో అమలా పాల్ డ్యాన్స్ షో కూడా ఉంది. దీని కోసం రిహార్సల్స్ చేస్తుంది. అమలాపాల్ రిహార్సల్స్ సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కాగా, ఇందులో మేకప్ లేని అమలాని చూసి అందరు షాక్ అవుతున్నారు. అమలా పాల్ నటించిన ‘భాస్కర్ ఒరు రాస్కెల్’ త్వరలో విడుదల కానుంది.

3522
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles