మళ్లీ లవ్ మ్యారేజే అంటున్న హాట్ బ్యూటీ

Sat,June 17, 2017 01:38 PM
Amala Paul ready for second marriage

సినీతారల్ని తెరమీద చూసి ఎంత ముచ్చట పడతారో, వారి వ్యక్తిగత జీవితంపట్ల కూడా అంత ఆసక్తి చూపిస్తారు ఆడియన్స్. వారి పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకోవాలని ఫ్యాన్స్ ఈగర్లీగా ఉంటారు. అందుకు తగ్గట్టుగానే కొందరు హీరోలు, హీరోయిన్ల వ్యవహారాలూ ఉంటాయి. సెలెబ్రిటీల్లో చాలామంది లవ్ ఎఫైర్లలో ఉన్నవాళ్లే. తారల ప్రేమాయణాలు సెన్సేషనల్ గా మారుతుంటాయి.

తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో మంచి గుర్తింపు ఉన్న అమలా పాల్ డైరెక్టర్ ఎ.ఎల్. విజయ్ ను లవ్ చేసి పెళ్లి చేసుకుంది. తర్వాత కొద్దికాలానికే వారిమధ్య గొడవలు జరిగి విడాకులు తీసుకుంది. విడాకులు తీసుకున్న అమలాపాల్ ప్రస్తుతం కెరీర్ పైనే దృష్టి పెట్టి వరసగా సినిమాలు చేస్తోంది. ఇటీవల అమలాపాల్ ఓ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చింది. మళ్లీ పెళ్లి చేసుకునే ఆలోచన ఉందా? అని ఆ ఇంటర్వ్యూలో అడిగేసరికి అమలా పాల్ చిరాకు పడింది. జీవితాంతం పెళ్లి చేసుకోకుండా ఉండిపోవాలనీ, సన్యాసినిగా మారిపోవాలని తాను అనుకోవడం లేదని ఈ కుట్టి ఆన్సరిచ్చింది.

ఓ సాధారణ యువతిగా తనకు కూడా పెళ్లి చేసుకుని సంసార జీవితాన్ని గడపాలని ఉంటుందని అంది. మళ్లీ పెళ్లి చేసుకుంటాననీ, అది కూడా ప్రేమ వివాహమే అవుతుందని చెప్పింది. ఎప్పుడు .. ఎవరిని చేసుకుంటాను అనే విషయాన్ని ముందుగానే మీడియాకు చెబుతానన్నది అమలాపాల్.

2427
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles