లుంగీ క‌ట్టిన అమ‌లా పాల్‌.. ఫైర్ అవుతున్న నెటిజ‌న్స్

Tue,December 4, 2018 01:21 PM
Amala Paul Posts An Interesting Photo

కేర‌ళ కుట్టి అమ‌లాపాల్ వివాదాలతో ఎక్కువ‌గా వార్త‌ల‌లో నిలుస్తూ వ‌స్తుంది. ఖ‌రీదైన కారు కొనుగోలు చేసి పాండిచ్చేరిలో రిజిస్ట్రేష‌న్ చేయ‌క‌పోవ‌డం, ఓ వ్యాపార‌వేత్త త‌న‌ని లైంగికంగా వేధించాడ‌నే కామెంట్స్‌తో అమ‌లాపాల్ కొద్ది రోజులు హాట్ టాపిక్‌గా నిలిచింది. తాజాగా ఈ అమ్మ‌డు త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫోటోని పోస్ట్ చేసి నెటిజ‌న్స్‌కి చేతినిండా ప‌ని చెప్పింది. ద‌ర్శ‌కుడు విజ‌య్ నుండి విడిపోయిన త‌ర్వాత అమ‌లాపాల్ ఫ్రీ బ‌ర్డ్ అయిన సంగ‌తి తెలిసిందే. ఫ్రెండ్స్‌తోనో లేదంటే సోలోగా ఈ అమ్మడు అనేక ప్రాంతాల‌కి చ‌క్క‌ర్లు కొడుతుంది. అక్క‌డి ప‌రిస్థితుల‌కి సంబంధించిన ఫోటోల‌ని కూడా సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది.

అమ‌లాపాల్ తాజాగా త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫోటో షేర్ చేసింది. ఇందులో కాషాయం రంగు లుంగి ధ‌రించి దానిని పైకెత్తి క‌ట్టింది. ఇక చేతిలో సీమ స‌రుకు బాటిల్ ప‌ట్టుకొని ఉంది. అడ‌విలో ఫోటోకి ఫోజులిచ్చిన ఈ అమ్మ‌డు త‌న ఫోటోకి లుంగీల‌కి ప్ర‌సిద్ధి చెందిన ప్రాంతంలో ఉన్నాను అని కామెంట్ పెట్టింది. ఇక్క‌డ ప్ర‌తి వ్య‌క్తి చేప‌ల కూర తింటూ నాటు సారా తాగుతుంటారు. ఈ రోజు బాగా తాగొచ్చు. ఎంజాయ్ చేద్దాం అని కామెంట్‌లో తెలిపింది. అమ‌లాపాల్ లుంగీ ఫోటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ కాగా, దీనిపై ప‌లువురు ప‌లు రకాలుగా స్పందిస్తున్నారు. ఫ్రీ ప్ర‌చారం కోసం ఇలాంటి సిల్లీ స్టంట్స్ అవ‌స‌ర‌మా అని కొంద‌రంటుంటే, మ‌రి కొంద‌రు లుంగీ లుక్‌లో సూప‌ర్భ్‌గా ఉన్నావ‌ని వ‌రుస పోస్ట్‌లు పెడుతున్నారు. అమ‌లాపాల్ ప్ర‌స్తుతం ప‌లు త‌మిళ సినిమాలతో బిజీగా ఉంది.

5365
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles