ధనుష్ కి మంచి భార్యనవుతానంటున్న అమలాపాల్!

Thu,June 29, 2017 09:26 AM
AMALA PAUL comments on dhanush..it is sensational

మాలీవుడ్ ముద్దుగుమ్మ అమలాపాల్ తమిళంలో జోరు కొనసాగిస్తుంది. ప్రస్తుతం వీఐపీ సీక్వెల్ గా తెరకెక్కుతున్న వీఐపీ 2 చిత్రంలో కథానాయికగా నటిస్తుంది. ఈ మూవీ త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో మూవీ యూనిట్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది. ఈ క్రమంలో అమలాపాల్ ఓ ఇంటర్వ్యూలో తాను ధనుష్ కి మంచి భార్యనవుతానని చెప్పి అందరికి షాక్ ఇచ్చింది. అయితే ఇది రియల్ లైఫ్ లో కాదు లేండి, రీల్ లైఫ్ లో. గతంలో వచ్చిన వేలై ఇల్లా పట్టాదారి( వీఐపీ- తెలుగులో రఘువరన్.బీటెక్) సినిమాలో ధనుష్ సరసన కథానాయికగా నటిచింది అమలాపాల్. ఇందులో ప్రియురాలిగా నటించి మెప్పించింది. ఇక సెకండ్ పార్ట్ లో హింసించే అర్ధాంగిగా నటిస్తుందట. ఒక వేళ వీఐపీ మూడో పార్ట్ ఉంటే అందులో మంచి భార్యని అవుతా అని చమత్కరించి అందరు నోళ్ళెల్లపెట్టేలా చేసింది. అంటే అమలాపాల్ ఇప్పుడే వీఐపీ 3లో తన పాత్ర కోసం ఖర్చీఫ్ వేసుకొని కూర్చున్నదన్నమాట. వీఐపీ 2 చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ కాజోల్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.

3961
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles