ఉత్కంఠ రేపుతున్న అమలాపాల్ 'ఆమె' టీజర్..

Tue,June 18, 2019 09:52 PM
Amala Paul Aame Telugu Official Teaser launched

రత్నకుమార్ దర్శకత్వంలో అమలాపాల్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం 'ఆమె'. ఈ సినిమా టీజర్‌ను కొంత సేపటి క్రితమే విడుదల చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అమలాపాల్ ఓ భిన్నమైన పాత్రలో ఈ సినిమాలో నటిస్తుండగా.. టీజర్ చూసిన పలువురు సినీ ప్రముఖులు ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇలాంటి పాత్రలు చేయాలంటే ఎంతో ధైర్యం ఉండాలని చెబుతున్నారు. కాగా ఈ సినిమాను త్వరలో విడుదల చేయనున్నామని.. అందుకు అందరి ఆశీర్వాదాలు తనకు కావాలని నటి అమలాపాల్ కోరింది. ఇక టీజర్‌లో ఓ తల్లి.. తప్పిపోయిన తన కూతురి కోసం పోలీస్ స్టేషన్‌కు వెళ్లడం.. ఆ తరువాత అమలాపాల్ దారుణమైన స్థితిలో పోలీసులకు కనిపించడం.. తదితర సీన్స్‌ను చూపించారు. దీన్ని బట్టి ఈ మూవీని ఓ బలమైన కథ ఆధారంగా తీసి ఉండవచ్చని తెలుస్తోంది. కాగా ఈ సినిమాను వీ స్టూడియోస్ సంస్థ నిర్మిస్తుండగా చరిత చిత్ర, తమ్మారెడ్డి భరద్వాజలు సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు.

3696
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles