ఈ మ‌ధ్య కాలంలో ఇలాంటిది చూడ‌లేదు: బ‌న్నీ

Tue,February 13, 2018 08:41 AM
alu arjun fida for malayalam song

మల‌యాళం సాంగ్‌లోని ఓ క్లిప్ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. ఇటు సామాన్యులే కాక అటుసెల‌బ్రిటీలు కూడా ఈ వీడియోలో అమ్మాయి ఎక్స్‌ప్రెషన్స్‌కి ఫిదా అవుతున్నారు. ఇది మలయాళం సినిమా 'ఓరు అదార్ లవ్‌'లోని 'మానిక్యా మలారాయ పూవి' అనే సాంగ్‌లోని క్లిప్ కాగా, ఈ వాలెంటైన్స్ డే స్పెషల్‌గా వచ్చిన ఈ వీడియో కుర్రకాళ్లు మతులు పోగొడుతుంది. ప్ర‌తి ఒక్క‌రు ఈ వీడియోని షేర్ చేస్తూ త‌మ ల‌వ్ ఎక్స్‌ప్రెస్ చేస్తున్నారు. తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా వీడియోలో కనిపిస్తున్న అమ్మాయి ప్రియా ప్రకాశ్ వారియర్ చూపుల‌కి ప‌డిపోయాడు. వెంట‌నే త‌న ట్విట్ట‌ర్ ఎకౌంట్‌లో వీడియోని షేర్ చేస్తూ.. ఈ మ‌ధ్య కాలంలో ఇంత క్యూటెస్ట్ వీడియో చూడ‌లేదు.


సింప్లిసిటీకి ఉన్న ప‌వ‌రే ఇది. నాకు బాగా న‌చ్చింది అంటూ కామెంట్ పెట్టాడు. మలయాళం సినిమా సాంగ్ మానిక్యా మలారాయ పూవి యూట్యూబ్‌లో పోస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే ట్రెండింగ్ అయింది. ట్రెండింగ్‌లో నాలుగో స్థానంలో ఉన్న ఆ వీడియోను ఇప్పటి వరకు దాదాపు 46 లక్షల మంది వీక్షించారు.

మలయాళం హీరోయిన్‌ ప్రియా ప్రకాశ్‌ వారియర్‌కి అనూహ్యంగా ఇంత‌ పాపులారిటీ దక్కడంతో ఆమె ఫుల్ హ్యాపీగా ఫీల‌వుతుంది . తనపై చూపించిన అభిమానానికి ఉప్పొంగిపోతుంది. తనకు దక్కిన విశేషాదరణపై ట్విటర్‌లో స్పందించింది. సోషల్‌ మీడియాలో తాను జాతీయస్థాయిలో స్టార్‌గా మారడాన్ని నమ్మకలేపోతున్నానని ప్రియా ప్రకాశ్‌ ట్వీట్‌ చేసింది. తనపై చూపించిన ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు తెలిపింది. 'ఓరు అదార్‌ లవ్‌' సినిమాతో వెండితెరకు ఆమె పరిచయమవుతోంది. ఈ సినిమా మార్చి 3న విడుదలకానుంది. ఈ మూవీలో నటిస్తున్నం‍దుకు చాలా సంతోషంగా ఉందని ప్రియ వ్యాఖ్యానించింది.

4577
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS