ఏప్రిల్ 24న సెట్స్ పైకి త్రివిక్రమ్ సినిమా..

Mon,April 8, 2019 07:03 PM
Alluarjun, Trivikram movie to go floors on april 24th

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, బన్నీ క్రేజీ కాంబినేషన్‌లో మరో సినిమా వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన అప్ డేట్ ఒకటి వచ్చింది. అల్లు అర్జున్ 19వ సినిమాగా వస్తున్న ఈ ప్రాజెక్టు ఏప్రిల్ 24 నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ విషయాన్ని బన్నీ పుట్టినరోజు సందర్భంగా హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. అల్లు అరవింద్‌, రాధాకృష్ణ..గీతా ఆర్ట్స్‌, హారిక అండ్ హాసిని బేన‌ర్‌ల‌పై ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నారు. థ‌మ‌న్ మ్యూజిక్ డైరెక్టర్. డీజే చిత్రం తర్వాత పూజా హెగ్డే మరోసారి అల్లు అర్జున్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది.

త్రివిక్రమ్, బన్నీ కాంబోలో వచ్చిన జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి చిత్రాలు బాక్సాపీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నాయి. ఈ రెండు చిత్రాల్లో తండ్రీ కొడుకుల అనుబంధాన్ని చక్కగా చూపించాడు త్రివిక్రమ్. ఈ చిత్రంలో కూడా తండ్రీకొడుకుల మధ్య అనుబంధాన్ని చూపించనున్నట్లు టాక్ వినిపిస్తోంది.

1598
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles