వోడాఫోన్ పై అల్లు హీరో ఆగ్రహం

Thu,June 21, 2018 04:47 PM
allu sirish fire on vodafone network

ఎప్పుడు అందరితో సరదాగా ఉండే అల్లు వారబ్బాయి అల్లు శిరీష్ కి పట్టలేని కోపమొచ్చింది. వెంటనే తన ట్విట్టర్ లో ట్వీట్ ద్వారా ఆగ్రహం వ్యక్తం చేశాడు. ప్రముఖ మొబైల్ నెట్ వర్కింగ్ సంస్థ అయిన వోడాఫోన్ వలన తను ఎదుర్కొంటున్న సిగ్నలింగ్ సమస్యని వివరిస్తూ కోపాన్ని వెళ్లగక్కాడు. మీ దగ్గర ఉన్న వాటి విలువను అవి దూరమయ్యేంత వరకు గుర్తించలేరు. ఇటీవల ఎయిర్ టెల్ నుండి వోడాఫోన్ కి పోర్ట్ చేయించుకున్నాను. ఎయిర్ టెల్ నుండి వోడాఫోన్ కి మారడం చెత్త ఆలోచన అని ఇప్పుడు అర్ధమవుతుంది. 4జీ కాదు కనీసం 2జీ సిగ్నల్స్ కూడా సరిగా రావడం లేదు. కాల్ డ్రాపింగ్ వదిలేసిన కనీసం సిగ్నల్స్ కూడా ఉండడం లేదు. గుణపాఠం నేర్చుకున్నాను అని ట్వీట్ చేశాడు.

శిరీష్ సినిమాల విషయానికి వస్తే మలయాళంలో నటించిన చిత్రం తెలుగులో యుద్ధ భూమి పేరుతో జూన్ 29న విడుదల కానుంది. ఇక ప్రస్తుతం మధుర ఎంటర్టైన్మెంట్స్, బిగ్బెన్ సినిమాస్ పతాకాలపై మధుర శ్రీధర్, యష్ రంగినేని నిర్మిస్తున్న ఏబీసీడీ చిత్రంలో కథానాయకుడిగా నటిస్తున్నాడు. సంజీవ్రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. రుక్సార్ థిల్లాన్ కథానాయిక. దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా మలయాళంలో విజయవంతమైన ఏబీసీడీ ఆధారంగా ఈ చిత్రం రూపొందుతుంది. బాలనటుడిగా తన హాస్యంతో తెలుగు ప్రేక్షకుల్ని అలరించిన భరత్ ఈ సినిమాతో సహాయనటుడిగా మారబోతున్నారు. అల్లు శిరీష్ స్నేహితుడిగా పూర్తిస్థాయి పాత్రలో కనిపించనున్నారు.


2951
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles