సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తున్న బ‌న్నీ ఫ్యామిలీ ఫోటోలు

Wed,July 25, 2018 10:36 AM
allu family pics goes viral

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారనే సంగ‌తి తెలిసిందే. అప్పుడప్పుడు త‌న ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలు, పిల్ల‌ల‌తో దిగిన ఫోటోల‌ని సామాజిక మాధ్యమాల‌లో షేర్ చేస్తూ అభిమానుల‌కి ఆనందాన్ని పంచుతాడు. తాజాగా బ‌న్నీ ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. బన్నీ భార్య స్నేహ తన ఇద్దరు పిల్లలు అయాన్, అర్హలతో ఉన్న పిక్‌తో పాటు స్నేహ సింగిల్ ఫోటో , అర్హ సోలో ఫోటోలు అభిమానుల‌ని ఆక‌ట్టుకుంటున్నాయి. ముఖ్యంగా లంగావోణిలో అర్హ చాలా ముద్దుగా ఉంద‌ని అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు.

ఇక త‌న భార్య సోలో ఫోటోని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. ఓ మై గాడ్ ! నేను న‌మ్మ‌లేక‌పోతున్నాను. ఇంత అంద‌మైన అమ్మాయిని వివాహం చేసుకున్నానా అంటూ కామెంట్ పెట్టాడు. త‌న భార్య ధ‌రించిన స‌ల్వార్ క‌మీజ్ డ్రెస్‌ని స్టైలిస్ట్ హ‌ర్మ‌న్ కౌర్ అందంగా త‌యారు చేశార‌ని కూడా తెలిపాడు. ఫ్యామిలీకి ఎక్కువ ప్రాధాన్య‌త ఇచ్చే బ‌న్నీ గ‌తంలోను త‌న ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలు షేర్ చేయ‌డంతో అవి కొద్ది క్ష‌ణాల‌లోనే వైర‌ల్‌గా మారిన సంగ‌తి తెలిసిందే. నా పేరు సూర్య అనే చిత్రంతో ఇటీవ‌ల ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన బ‌న్నీ త‌ర్వాతి సినిమాని ఓకే చేయ‌లేదు. విక్ర‌మ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ఉండొచ్చ‌ని అభిమానులు భావిస్తున్నారు. దీనిపై క్లారిటీ రావ‌ల‌సి ఉంది.

3151
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles