అల్లు అర‌వింద్ త‌న‌యుడి నిర్మాణంలో వ‌రుణ్ తేజ్ మూవీ

Thu,February 7, 2019 08:25 AM
allu bobby produce varun tej movie

ప్ర‌ముఖ నిర్మాత అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ నిర్మాణ సంస్థ‌లో ఎన్నో హిట్ చిత్రాలు చేశాడు. గీతా ఆర్ట్స్ 2 అనే సంస్థ‌ని కూడా స్థాపించి ఈ బేన‌ర్‌పై కుర్రాళ్ళతో స‌క్సెస్ మూవీస్‌ని నిర్మిస్తున్నారు. అయితే అల్లు ఫ్యామిలో అర‌వింద్ నిర్మాత‌గా స‌క్సెస్ అయితే ఆయ‌న ఇద్ద‌రు త‌న‌యులు అల్లు అర్జున్‌, శిరీష్‌లు హీరోలుగా రాణిస్తున్నారు. అల్లు అరవింద్ మ‌రో త‌న‌యుడు అల్లు బాబీ తండ్రి బాట‌లోనే వెళ్ళాల‌ని భావిస్తున్న‌ట్టు తెలుస్తుంది.

మెగా హీరో వ‌రుణ్ తేజ్ త్వ‌ర‌లో హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో వాల్మీకీ అనే చిత్రం చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. త‌మిళ సూప‌ర్ హిట్ మూవీ జిగ‌ర్తాండ్రాకి రీమేక్‌గా ఈ మూవీ రూపొంద‌నుంది. వ‌చ్చే నెల‌లో ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్ళ‌నుంది. అయితే ఈ మూవీతో పాటుగా వరుణ్‌ తేజ్‌ హీరోగా కిరణ్‌ కొర్రపాటి అనే నూతన దర్శకుడు డైరెక్ష‌న్‌లో ఓ సినిమా చేయ‌నున్నాడ‌ట‌. ఈ సినిమాని అల్లు బాబీ నిర్మించ‌నున్నాడ‌ని అంటున్నారు. ఈ చిత్రంలో వ‌రుణ్ తేజ్ బాక్స‌ర్‌గా క‌నిపించ‌నున్నాడ‌ని, ఇందుకోస‌మే లాస్ ఏంజిల్స్‌లో బాక్సింగ్ కోసం ప్ర‌త్యేక శిక్ష‌ణ తీసుకుంటున్నాడ‌ని అంటున్నారు. చిత్ర ద‌ర్శ‌కుడు కిరణ్‌ కొర్రపాటి.. మిస్టర్, తొలిప్రేమ’ సినిమాలకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా వర్క్‌ చేశారు

1575
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles