ఇంట్లోకి మ‌రో కొత్త కారు వ‌చ్చి చేరింది

Sun,August 25, 2019 08:30 AM
Allu Arjun with new car

సినిమా సెల‌బ్రిటీలు కార్లు, బైకుల‌పై ఎక్కువ మోజు చూపిస్తుంటారు. మార్కెట్‌లోకి ఏదైన కొత్త‌ది వ‌చ్చిందంటే దానిని కొనే వ‌ర‌కు నిద్ర‌పోరు. టాలీవుడ్ స్టైలిష్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ ప్ర‌తి విష‌యంలో స్టైలిష్‌గా ఉండాలని అనుకుంటాడు. అందుకే ఇటీవ‌ల భారీ ఖ‌ర్చుతో కార‌వ్యాన్ త‌యారు చేయించుకున్నాడు. ముంబైకి చెందిన ప్ర‌ముఖ డిజైన‌ర్ అల్లు అర్జున్ టేస్ట్‌కి త‌గ్గ‌ట్టు ఇంటీరియ‌ర్‌ని డిజైన్ చేశారు. ఇక తాజాగా త‌న గ్యారేజ్‌లోకి మ‌రో కొత్త వాహ‌నం తీసుకొచ్చారు బ‌న్నీ. రేంజ్ రోవర్ లేటెస్ట్ మోడల్ కారును కొనుగోలు చేసిన బ‌న్నీ ఆ కారుతో ఫోటో దిగి సోష‌ల్ మీడియాలో షేర్ చేశాడు. ఇంట్లోకి మ‌రో కారు వ‌చ్చింది. దానికి బీస్ట్ అని పేరు పెట్టిన‌ట్టు తెలిపాడు. తాను ఎప్పుడు కొత్త వస్తువు కొన్నా, 'విశ్వసనీయత' అనే ఒకే ఒక్క విషయాన్ని పరిగణనలోకి తీసుకుంటానని వెల్లడించారు. ప్ర‌స్తుతం త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో అల‌.. వైకుంఠ‌పుర‌ములో అనే చిత్రం చేస్తున్నాడు బ‌న్నీ. ఇందులో ట‌బు, స‌త్య‌రాజ్‌, సుశాంత్‌, నివేదా పేతురాజ్ కీలక పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఈ చిత్రాన్ని హారికా హాసిని క్రియేషన్స్‌, గీతా ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సంక్రాంతి కానుక‌గా ఈ చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాల‌ని మేక‌ర్స్ భావిస్తున్నారు.

3951
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles