స్విట్జర్లాండ్‌లో చ‌క్క‌ర్లు కొడుతున్న బ‌న్నీ ఫ్యామిలీ

Tue,May 14, 2019 10:24 AM
Allu Arjun Switzerland trip with family

నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా చిత్రం త‌ర్వాత బ‌న్నీ .. త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ క్రేజీ ప్రాజెక్ట్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌ల ఈ చిత్రం ఫ‌స్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకోగా, త్వ‌ర‌లో మ‌రో షెడ్యూల్ జ‌రుపుకోనుంది. అయితే ఈ గ్యాప్‌లో హాలీడే ట్రిప్ కోసం తన భార్య స్నేహారెడ్డి, పిల్లలు అర్హ, అయాన్ లతో కలిసి స్విట్జ‌ర్లాండ్ వెళ్లాడు బ‌న్నీ. మంచు కొండల ముందున్న ఓ స్టార్ రిసార్ట్ లో బస చేసిన అల్లు అర్జున్, విడిదికి సంబంధించిన చిత్రాలను తన సోషల్ మీడియా ఖాతాల్లో పంచుకున్నాడు. లైఫ్‌ లో ఎలా ఉండాలి అని అడిగితే వారు హ్యాపీగా ఉండాల‌ని అన్నారంటూ ఫోటోల‌కి కామెంట్ పెట్టాడు బ‌న్నీ. ప్ర‌స్తుతం బ‌న్నీ ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. అల్లు అర్జున్ .. త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో త‌న 19వ సినిమా చేస్తుండ‌గా, 20వ సినిమాని సుకుమార్ డైరెక్ష‌న్‌లో చేయ‌నున్నాడు. వేణు శ్రీరామ్ ద‌ర్శ‌క‌త్వంలోను బ‌న్నీ ఓ సినిమా చేయ‌బోతున్నాడు. ఆ చిత్రానికి ఐకాన్ అనే పేరు పెట్ట‌గా, క్యాప్ష‌న్‌గా కనబడుట లేదు అని ఉంచారు.

View this post on Instagram

Matterhorn . Switzerland🇨🇭#postcardshot . #aaclicks

A post shared by Allu Arjun (@alluarjunonline) on

View this post on Instagram

Life Lo Ela Undali ??? And they said “ HAPPY GAAAAAAA “

A post shared by Allu Arjun (@alluarjunonline) on

View this post on Instagram

Daddy Cool 😎

A post shared by Allu Arjun (@alluarjunonline) on

1499
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles