సైరాలో ముఖ్య పాత్ర పోషించ‌నున్న మెగా హీరో..!

Thu,August 9, 2018 09:41 AM
allu arjun special role in syeraa

ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో భారీ బడ్జెట్‌తో అత్యంత ప్ర‌తిష్టాత్మకంగా తెర‌కెక్కుతున్న చిత్రం సైరా న‌ర‌సింహ‌రెడ్డి. స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుడు ఉయ్యాల వాడ న‌ర‌సింహారెడ్డి జీవిత నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రం రీసెంట్‌గా రెండో షెడ్యూల్ మొద‌లు పెట్టుకుంది. చిరంజీవి ప్ర‌ధాన పాత్ర‌లో సురేంద‌ర్ రెడ్డి హై టెక్నిక‌ల్ వాల్యూస్‌తో సినిమాని తెర‌కెక్కిస్తున్నాడు. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో బాలీవుడ్ స్టార్ అమితాబ్‌తో పాటు.. విజయ్ సేతుపతి, సుదీప్, న‌య‌న‌తార‌, జగపతిబాబు లాంటి స్టార్లు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. నిహారిక కూడా ముఖ్య పాత్ర‌లో క‌నిపించ‌నుంది. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం చారిత్రాత్మ‌క చిత్రం రుద్ర‌మ‌దేవిలో గోన గ‌న్నారెడ్డిగా కనిపించి అల‌రించిన అల్లు అర్జున్ సైరాలోను క‌త్తి ప‌ట్టి క‌నిపించ‌నున్నాడ‌ట‌. రుద్ర‌మదేవిలో వెరైటీ స్లాంగ్‌తో బన్నీ చెప్పిన గ‌మ్మునుండ‌వోయ్ అనే డైలాగ్ ఎంత పాపుల‌ర్ అయిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. మ‌రి సైరాలో బ‌న్నీ ఎలాంటి గెట‌ప్‌తో సంద‌డి చేస్తాడో తెలియాలంటే కొన్నాళ్ళు ఆగాల్సిందే. మ‌రో మెగా హీరో వ‌రుణ్ తేజ్ కూడా సైరాలో క‌నిపించ‌నున్నాడ‌ని అంటున్నారు. ఈ వార్త‌ల‌పై క్లారిటీ రావ‌లసి ఉంది.

2202
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS