స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటాడనే విషయం విదితమే. ప్రస్తుతం ఫేస్ బుక్, ట్విట్టర్ ద్వారా అభిమానులకి చేరువగా ఉంటున్న బన్నీ మరో రెండు రోజులలో ఇన్స్ట్రాగ్రామ్ తెరుస్తానని నవంబర్ 19న వెల్లడించారు. అన్నట్టుగానే కొద్ది సేపటి క్రితం ఇన్స్ట్రాగ్రామ్ ఖతా ఓపెన్ చేసి తొలి ఫోటోగా కూతురి ఫోటో పోస్ట్ చేశాడు. ఈ రోజు అర్హా ఫస్ట్ బర్త్ డే కావడంతో చిన్నారి ఫోటో షేర్ చేసిన బన్నీ ‘నా చిట్టి ఏంజెల్కి పుట్టినరోజు శుభాకాంక్షలు. అప్పుడే నీకు ఏడాది నిండిందంటే నమ్మలేకపోతున్నాను.’ అని పేర్కొంటూ ఫస్ట్బర్త్డే, అల్లుప్రిన్సెస్, ఫస్ట్ పోస్ట్ అన్న హ్యాష్ట్యాగ్లు జత చేశారు. అర్హా ఫోటోకి కొద్ది నిమిషాలలో 26వేల మంది నెటిజన్స్ లైకులు కొట్టారు. సుమారు 1900 మంది బర్త్ డే శుభాకాంక్షలు తెలియజేశారు. తన పేరుతో పాటు భార్య పేరులోని కొన్ని అక్షరాలతో కూతురికి పేరు పెట్టాడు స్టైలిష్ స్టార్. అర్జున్లోని AR, స్నేహలోని HAను కలిపి అర్హ అని నామకరణం చేశాడు. హిందూ సంప్రదాయ ప్రకారం అర్హ అంటే లార్డ్ శివ, ఇస్లామిక్లో నిర్మలమైన అని అర్థం. ప్రస్తుతం ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి వక్కంతం వంశీ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో బన్నికి జోడీగా అను ఇమ్మాన్యుయేల్ నటిస్తున్నారు. 2018లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.