తాత‌ని చూసి గ‌ర్వ‌ప‌డుతున్న అల్లు అర్జున్

Wed,November 20, 2019 12:16 PM

అల్లు రామ‌లింగ‌య్య న‌ట వార‌స‌త్వాన్ని పుణికిపుచ్చుకొని, మెగాస్టార్ చిరంజీవి స్పూర్తితో ప్ర‌స్తుతం టాలీవుడ్ టాప్ హీరోల‌లో ఒకరిగా ఉన్నారు అల్లు అర్జున్. సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే అల్లు అర్జున్ తాజాగా త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫోటో షేర్ చేశాడు. అందులో త‌న తాత సాధించిన ఘ‌న‌త‌ని చూసి గ‌ర్వ‌ప‌డుతున్నారు. అల్లు రామ‌లింగ‌య్య ప‌ద్మ‌శ్రీ అవార్డు అందుకొని తిరిగి వ‌చ్చిన స‌మ‌యంలో ఆయ‌న త‌న‌ మనవలు, మనవరాళ్లతో క‌లిసి ఫోటో దిగారు. ఆ ఫోటోని ఇప్పుడు త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన బ‌న్నీ.. `మా తాతయ్య పద్మశ్రీ అవార్డు అందుకుని వచ్చిన అనంతరం మేమందరం ఆయనను విమానాశ్రయంలో కలిసేందుకు వెళ్ళాం. పాలకొల్లు నుంచి పద్మశ్రీ వరకు.. ఆయ‌న‌ది అద్భుతమైన ప్రయాణం` అని బ‌న్నీ త‌న కామెంట్‌లో తెలిపారు. ఆ ఫోటోలో బన్నీ రామ‌లింగ‌య్య కుడి చేతికింద దండ వేసుకొని చాలా క్యూట్‌గా క‌నిపిస్తున్నాడు. కాగా, ప్ర‌స్తుతం అల్లు అర్జున్.. త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో అల‌.. వైకుంఠ‌పుర‌ములో చిత్రం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. సంక్రాంతి కానుక‌గా విడుద‌ల కానున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే క‌థానాయిక‌గా న‌టిస్తుంది. థ‌మ‌న్ అందించిన స్వ‌రాల‌కి మంచి రెస్పాన్స్ రాగా, మూవీ కూడా ప్రేక్ష‌కుల‌ని త‌ప్ప‌క అలరిస్తుందని అంటున్నారు.

1421
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles