తెలంగాణ ప్రభుత్వంపై బన్నీ ప్రశంసల వర్షం

Wed,December 20, 2017 03:01 PM
allu arjun praise telangana government

ప్రపంచ తెలుగు మహాసభలని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిందని స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ట్విట్టర్ ద్వారా కొనియాడారు. తెలుగు సాహిత్యం, సంస్కృతిని చాటి చెప్పేందుకు ప్రభుత్వం తలపెట్టిన ఈ కార్యక్రమం అత్యద్భుతం అని బన్నీ ట్వీట్ చేశాడు. అంతేకాదు తెలుగు మహాసభలు విజయవంతం కావడంతో తనకి ఎంతో ఆనందంగా, గర్వంగా ఉందని అన్నాడు. హైదరాబాద్ వేదికగా డిసెంబర్ 15 నుండి 19 వరకు జరిగిన ప్రపంచ తెలుగు మహా సభలకి రాష్ట్రం నుండే కాదు విదేశాల నుండి భాషాభిమానులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. సోమవారం రోజు ఇండస్ట్రీకి సంబంధించి స్టార్ హీరోలతో పాటు కవులు, రచయితలు, భాషాభిమానులు, పరిశోధకులు, అధ్యాపకులు, విద్యార్థులు హాజరయ్యారు. ప్రతి ఒక్కరు ప్రభుత్వం చేపట్టిన ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంపై ప్రశంసల వర్షం కురిపించారు. మహాసభల నిర్వహణపై ఆనందాన్ని వ్యక్తంచేశారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధితోపాటు తెలుగు భాష అభివృద్ధికోసం రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు చేస్తున్న కృషిని సినీ ప్రముఖులు మనస్ఫూర్తిగా ప్రశంసించిన సంగతి తెలిసిందే.4815
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles