కుండ ముందు ఏ హీట‌ర్స్ ప‌నికి రావు: అల్లు అర్జున్‌

Tue,February 13, 2018 04:09 PM
allu arjun gives the clarity on KAANGDI

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ త‌న కూతురి బ‌ర్త్ డే సంద‌ర్భంగా ఇన్‌స్ట్రాగ్రామ్ ఎకౌంట్ ఓపెన్ చేసిన సంగ‌తి తెలిసిందే. తొలి పోస్ట్ గా త‌న కూతురి ఫోటోని షేర్ చేసిన బ‌న్నీ ఆ త‌ర్వాత ఫ్యామిలీతో పాటు సినిమాల‌కి సంబంధించి ఫోటోలు షేర్ చేస్తున్నాడు. తాజాగా త‌న లేటెస్ట్ మూవీ నా పేరు సూర్య సినిమా షూటింగ్ స‌మయంలో వాడిన కుండ గురించి వివ‌రించాడు. దేశ భ‌క్తి నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న బ‌న్నీ మూవీ కాశ్మీర్ స‌రిహ‌ద్దుల‌లో మైనస్‌ 12 డిగ్రీల ఉష్ణోగ్రతఉన్న వాతావ‌ర‌ణంలో షూటింగ్ జ‌రుపుకుంటుంది. అంత‌టి చలిలో పరీక్ష‌లా ఫీలై షూటింగ్ చేస్తున్న టీంకి కుండ ఉప‌శ‌మ‌నం క‌లిగించింద‌ట‌. చ‌లి తీవ్ర‌త‌ని త‌ట్టుకునేందుకు టీం ఓ కుండ‌ని త‌మ‌తో తీసుకెళ్ళార‌ట‌. ఆ కుండ‌ని కాంగ్డి అంటారని బ‌న్నీ అన్నాడు. కశ్మీర్‌లో చిత్రీకరణ జరుగుతున్నప్పుడు ఆ ప్ర‌దేశంలోని చల్లటి వాతావరణాన్ని తట్టుకోవడం ఈ కుండతోనే సాధ్యమైంది. ఈ కుండ ముందు ఏ ఆధునిక హీటర్లు పనికిరావు అని కుండ ఫోటో షేర్ చేస్తూ క్యాప్షన్‌లో పేర్కొన్నారు అల్లు అర్జున్ . నా పేరు సూర్య చిత్రం వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతుండ‌గా, ఇందులో అను ఎమ్మాన్యుయేల్ క‌థానాయిక‌గా న‌టిస్తుంది. విశాల్‌-శేఖర్ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. మూవీని ఏప్రిల్ 27న విడుద‌ల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

3863
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS