మ‌ల్టీ ప్లెక్స్ బిజినెస్‌లోకి అడుగుపెట్టే ఆలోచ‌న‌లో బ‌న్నీ

Thu,December 6, 2018 10:04 AM
allu arjun enter into multiplex business

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ఏషియన్ ఫిల్మ్స్ సంస్థతో కలిసి ఏఎంబీ సినిమాస్ పేరిట ఓ మల్టీప్లెక్స్‌ను నిర్మించిన సంగ‌తి తెలిసిందే. త్వ‌ర‌లో ఆయన మ‌రో మ‌ల్టీ ప్లెక్స్ నిర్మించ‌నున్న‌ట్టు ఇటీవ‌ల‌ వార్త‌లు వ‌స్తున్నాయి. క‌ట్ చేస్తే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా మ‌ల్టీ ప్లెక్స్ బిజినెస్ రంగంలోకి అడుగుపెట్ట‌బోతున్నాడ‌ని అంటున్నారు. ఇప్పటికే వేరు వేరు వ్యాపార రంగంలో రాణిస్తున్న స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్ అమీర్ పేట్ స‌త్యం థియేట‌ర్‌ని మల్టీ ప్లెక్స్‌గా మార్చేందుకు చ‌ర్చ‌లు జ‌రుపుతున్నాడ‌ని కొంద‌రు అంటున్నారు. మ‌రి కొంద‌రు సిటీ సెంటర్‌లో ఓ ప్రముఖ థియేటర్‌ ఉన్న స్థలాన్ని మల్టీప్లెక్స్‌ నిర్మాణానికి సెలెక్ట్ చేసినట్టుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయంపై బన్నీ టీం నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా చిత్రం త‌ర్వాత బ‌న్నీ ఏ సినిమా చేయ‌బోతున్నాడ‌నే విష‌యంపై ఎలాంటి అధికారిక ప్ర‌క‌ట‌న చేయ‌లేదు. త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో ఆయ‌న చేయ‌నున్నాడ‌ని అంటున్నారు. క్లారిటీ రావల‌సి ఉంది.

1667
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS