విజేత విజ‌యోత్స‌వానికి ముఖ్య అతిధిగా స్టైలిష్ స్టార్

Sun,July 15, 2018 08:18 AM
allu arjun chief guest for vijetha Vijayotsavam

తండ్రీ కొడుకుల మధ్య జ‌రిగే ఎమోష‌న‌ల్ డ్రామాగా తెర‌కెక్కిన చిత్రం విజేత‌. మెగా స్టార్ చిరంజీవి చిన్న అల్లుడు క‌ళ్యాణ్ దేవ్ హీరోగా తెర‌కెక్కిన ఈ చిత్రం పాజిటివ్ టాక్ సంపాదించుకుంది. బాక్సాఫీస్ ద‌గ్గ‌ర వ‌సూళ్ళు బాగానే రాబ‌డుతుందని అంటున్నారు. వారాహి చలనచిత్రం బ్యానర్‌‌లో సాయి కొర్రపాటి సారథ్యంలో రజినీ కొర్రపాటి నిర్మించిన ‘విజేత’ చిత్రానికి రాకేశ్ శశి దర్శకత్వం వ‌హించారు. మాళ‌విక నాయ‌ర్ క‌థానాయిక‌గా న‌టించిన ఈ చిత్రంలో ముర‌ళీ శ‌ర్మ ముఖ్య పాత్ర పోషించారు.

విజేత చిత్రానికి పాజిటివ్ టాక్ రావ‌డంతో చిరు, రామ్ చ‌ర‌ణ్‌, ఉపాస‌న క‌ళ్యాణ్ దేవ్‌తో పాటు చిత్ర యూనిట్‌పై ప్ర‌శంస‌లు కురిపించారు. ఇక స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన వంతు బాధ్యతని నిర్వర్తించబోతున్నారు. చిత్రం మంచి విజ‌యం సాధించ‌డంతో విజ‌యోత్స‌వ వేడుక‌ని ప్లాన్ చేశారు నిర్మాత‌లు. ఈ రోజు మ‌ధ్యాహ్నం జ‌ర‌గ‌నున్న జ‌ర‌గ‌నున్న వేడుక‌కి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గెస్ట్‌గా హాజ‌రు కానున్నాడు. దీనికి సంబంధించిన వివరాలను తెలుపుతూ.. చిత్ర యూనిట్ పోస్టర్‌ను కూడా విడుదల చేసింది. చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించగా ‘బాహుబలి’ కెమెరామెన్ కె.కె.సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫి అందించారు.

1896
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles