ప్రియా ప్ర‌కాశ్ మూవీ వేడుక‌కి గెస్ట్‌గా బ‌న్నీ

Mon,January 21, 2019 01:04 PM

క‌న్నుగీటుతో కోట్లాది హృద‌యాల‌ని కొల్ల‌గొట్టిన మ‌ల‌యాళీ భామ ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్‌. ‘ఒరు అదార్ లవ్‌’ చిత్రంలోని ‘మాణిక్య మలరయ’ అనే పాటలో ప్రియా హావభావాల‌కి ప్ర‌తి ఒక్క‌రు ఫిదా కావ‌డంతో ఆమె రాత్రికి రాత్రే స్టార్ స్టేట‌స్ అందుకుంది. ప్రియా ప్ర‌కాశ్ ఎక్స్‌ప్రెష‌న్స్‌కి సెల‌బ్రిటీలు కూడా ఎంత‌గా ఫిదా అయ్యారో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. మ‌రి అంత‌గా ఆక‌ట్టుకున్న ప్రియా ప్ర‌కాశ్ గూగుల్‌లో అత్యధిక మంది సెర్చ్‌ చేసిన భారతీయ సెలబ్రిటీగా మొదటి స్థానం సంపాదించుకున్నారు. ఆ వీడియోని ఇప్పటికి రెండు కోట్ల మంది చూశారు.


ఒరు ఆదార్ ల‌వ్ చిత్రం ఎప్పుడో విడుద‌ల కావ‌ల‌సి ఉన్నా ప‌లు కార‌ణాల వ‌ల‌న వాయిదా ప‌డుతూ వ‌చ్చింది. ఇప్పుడు ఈ చిత్రాన్ని తెలుగు, మ‌ల‌యాళంలో ఫిబ్ర‌వ‌రి 14న విడుద‌ల చేసేందుకు ప్లాన్ చేస్తున్నార‌ట‌. తెలుగులో ఈ చిత్రం ల‌వ‌ర్స్ డే పేరుతో విడుద‌ల కానుంది. ఒమర్ లులు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని నిర్మాతలు ఎ. గురురాజ్‌, సి.హెచ్‌.వినోద్‌రెడ్డి సుఖీభ‌వ సినిమాస్ బ్యానర్‌పై విడుద‌ల చేస్తున్నారు. జ‌న‌వ‌రి 23న ఈ చిత్ర ఆడియో రిలీజ్ వేడుకను హైదరాబాద్‌లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్‌లో జ‌రిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వేడుక‌కి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిధిగా హాజ‌రు కానున్నారు. అడిగిన వెంట‌నే ఫంక్ష‌న్‌కి వ‌చ్చేందుకు ఒప్పుకున్న బ‌న్నీకి నిర్మాత‌లు కృత‌జ్ఞ‌తలు తెలిపారు.1927
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles