మెగాస్టార్ చిరంజీవి కెరియర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం సైరా నరసింహరెడ్డి. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్లో విడుదల కానుంది. భారీ తారాగణంతో రూపొందుతున్న ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, నయనతార, విజయ్ సేతుపతి, సుదీప్, జగపతి బాబు, తమన్నా ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు. ఇక ఈ చిత్రంలో బన్నీ కూడా భాగం కానున్నాడని ఇటీవల వార్తలు వచ్చాయి. సురేందర్ రెడ్డి, అల్లు అర్జున్ కాంబినేషన్లో వచ్చిన రేసు గుర్రం చిత్రం వీరిద్దరికి మంచి విజయాన్ని అందించగా, అప్పటి నుండి వీరి మధ్య మంచి రాపో ఉందని, ఈ క్రమంలోనే సైరా సినిమా కోసం బన్నీ కీలక పాత్ర పోషించాడని అన్నారు. తాజా సమాచారం ప్రకారం సైరా చిత్రంలో బన్నీ కీలక పాత్ర పోషించాడని , ఆయన పాత్రకి సంబంధించిన షూటింగ్ కూడా పూర్తైందని చెబుతున్నారు. నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న బన్నీ త్వరలో త్రివిక్రమ్‌తో కలిసి క్రేజీ ప్రాజెక్ట్ చేయనున్న సంగతి తెలిసిందే. ఇందులో మనోడు డిఫరెంట్ లుక్‌తో కనిపించనున్నాడు. ఇక సైరా విషయానికి వస్తే ఈ చిత్రం తెలుగుతోపాటు తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.