అల్లు అర్జున్, స్నేహా దంపతులకి అయాన్, అర్హ అనే ఇద్దరు చిన్నారులు జన్మించిన సంగతి తెలిసిందే. కూతురుకి తన పేరుతో పాటు భార్య పేరులోని కొన్ని అక్షరాలతో అర్హ అని పేరు పెట్టాడు స్టైలిష్ స్టార్. అర్జున్లోని AR, స్నేహలోని HAను కలిపి అర్హ అని నామకరణం చేశాడు. హిందూ సంప్రదాయ ప్రకారం అర్హ అంటే లార్డ్ శివ, ఇస్లామిక్లో నిర్మలమైన అని అర్థం. ఫ్యామిలీని ఎక్కువగా ఇష్టపడే బన్నీ గత ఏడాది నవంబర్ 21న కూతురి బర్త్ డే సందర్భంగా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి తొలి ఫోటోగా కూతురి పిక్ పెట్టి అభిమానులకి చాలా ఆనందాన్ని అందించాడు. అర్హా ఫోటో పెట్టిన కొద్ది నిమిషాలలో నెటిజన్స్ లైకులు కొట్టడమే కాదు విపరీతమైన షేరులు చేశారు. అయితే తన తల్లి స్నేహాతో నవ్వుతూ ముద్దుగా... అందంగా ఫోటోకు ఫోజిచ్చింది అర్హ. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. సంవత్సరం పూర్తి చేసుకున్న అర్హని చూసి మెగా అభిమానులు మురిసిపోతున్నారు. ఇదిలా ఉంటే అల్లు అర్జున్ తాజా చిత్రం నా పేరు సూర్య మే 4న విడుదల కానుంది. వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో అను ఎమ్మాన్యుయేల్ కథానాయికగా నటించింది. ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుక ఏప్రిల్ 29న గచ్చిబౌలిలో జరగనుంది.