బ‌న్నీ త‌న‌య‌కి బ‌ర్త్‌డే విషెస్

Wed,November 21, 2018 10:53 AM
allu arha completes two years

అల్లు అర్జున్, స్నేహా రెడ్డి దంపతులకి అయాన్, అర్హ అనే ఇద్ద‌రు చిన్నారులు ఉన్న‌ సంగ‌తి తెలిసిందే. కూతురుకి తన పేరుతో పాటు భార్య పేరులోని కొన్ని అక్షరాలతో అర్హ అని పేరు పెట్టాడు స్టైలిష్ స్టార్. అర్జున్‌లోని AR, స్నేహలోని HAను కలిపి అర్హ అని నామకరణం చేశాడు. హిందూ సంప్రదాయ ప్రకారం అర్హ అంటే లార్డ్ శివ, ఇస్లామిక్‌లో నిర్మలమైన అని అర్థం. ఫ్యామిలీని ఎక్కువగా ఇష్ట‌ప‌డే బ‌న్నీ గ‌త ఏడాది న‌వంబ‌ర్ 21న కూతురి మొద‌టి బ‌ర్త్ డే సంద‌ర్భంగా ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేసి తొలి ఫోటోగా కూతురి పిక్ పెట్టి అభిమానుల‌కి చాలా ఆనందాన్ని అందించాడు. అర్హా ఫోటో పెట్టిన కొద్ది నిమిషాలలో నెటిజన్స్ లైకులు కొట్టడమే కాదు విపరీత‌మైన షేరులు చేశారు. ఇటీవ‌ల‌ త‌న తల్లి స్నేహాతో నవ్వుతూ ముద్దుగా... అందంగా ఫోటోకు ఫోజిచ్చింది అర్హ‌. ఆ ఫోటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. నేడు అర్హ రెండో సంవ‌త్స‌రంలోకి అడుగుపెట్ట‌డంతో అర్హ‌కి సంబంధించిన అందమైన ఫోటోలు సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. ప్ర‌స్తుతం ఆ ఫోటోలు సోష‌ల్ మీడియాలో విప‌రీతంగా చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.


2118
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles