గీతా ఆర్ట్స్ బేన‌ర్‌లో న‌టించ‌నున్న ముగ్గురు మెగా హీరోలు

Tue,August 7, 2018 12:20 PM
Allu Aravind next Three Films With The Mega Heroes

టాలీవుడ్‌ టాప్ ప్రొడ్యూస‌ర్ అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ బేన‌ర్‌పై ఎన్నో బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల‌ని నిర్మించిన సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌ల గీతా ఆర్ట్స్ 2 అనే సంస్థ‌ని స్థాపించి ఇందులో చిన్న సినిమాలు చేస్తున్నాడు. తాజాగా గీత గోవిందం అనే చిత్రం గీతా ఆర్ట్స్‌2 బేన‌ర్‌పై రూపొంద‌గా, ఈ మూవీని ఆగ‌స్ట్ 15న విడుద‌ల చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. క‌ట్ చేస్తే అల్లు అర‌వింద్ రానున్న రోజుల‌లో త‌న బేన‌ర్‌పై ముగ్గురు మెగా హీరోల‌తో మూడు డిఫరెంట్ ప్రాజెక్టులు చేయ‌నున్న‌ట్టు తెలిపాడు. చిరంజీవి, అల్లు అర్జున్‌, వ‌రుణ్ తేజ్ హీరోలుగా అల్లు అరవింద్ క్రేజీ ప్రాజెక్టులు చేయ‌నుండగా, చిరు సినిమా బోయ‌పాటి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న‌ట్టు తెలుస్తుంది. అల్లు అర్జున్‌, వ‌రుణ్ తేజ్ సినిమాల‌కి సంబంధించిన క్లారిటీ రావ‌ల‌సి ఉంది. చిరు ప్ర‌స్తుతం సైరా సినిమాతో బిజీగా ఉండ‌గా, వ‌రుణ్ తేజ్ ఎఫ్‌2 చిత్రంతో పాటు సంక‌ల్ప్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇక అల్లు అర్జున్ ఎవ‌రి ద‌ర్శ‌క‌త్వంలో చేయ‌నున్నాడు అనేది తెలియాల్సి ఉంది.

3577
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS