'బంగారు బుల్లోడు'గా రాబోతున్న అల్లరోడు

Sun,April 7, 2019 07:43 AM
Allari Naresh55 movie first look released

ఈవీవీ స‌త్య‌నారాయ‌ణ త‌న‌యుడిగా తెలుగు తెర‌కు ప‌రిచ‌యం అయిన అల్ల‌రి నరేష్ ఆన‌తి కాలంలోనే త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. కామెడీతో కిత‌కిత‌లు పెట్టించే ఈ అల్ల‌రోడు ఇటీవ‌లి కాలంలో స‌రైన స‌క్సెస్ లు అందుకోలేక‌పోతున్నాడు. చివరిగా సిల్లీ ఫెలోస్ అనే చిత్రంతో ప్రేక్షకులు ముందుకు వచ్చిన అల్లరోడు మహేష్ 25వ చిత్రంలో చేస్తున్నాడు. అయితే అయన ప్రధాన పాత్రలో ఓ చిత్రం రాబోతుంది. ఏ టీవీ సమర్పణలో ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై పి.వి.గిరి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర ‘బంగారు బుల్లోడు’ టైటిల్‌తో ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అల్లరి నరేష్ నటిస్తోన్న 55వ చిత్రమిది. పూజా జవేరి హీరోయిన్‌గా నటిస్తోంది. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్‌టైనింగ్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రం షూటింగ్ తుది దశకు చేరుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేసి త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ చిత్రం అయిన నరేష్ కి మంచి విజయం అందించాలని అభిమానులు కొరుతున్నారు.

1924
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles