కాన్సెప్ట్ బేస్డ్ చిత్రం చేయ‌బోతున్న అల్ల‌రి న‌రేష్‌

Tue,November 12, 2019 12:07 PM

హీరోగా ప‌లు వైవిధ్య‌మైన పాత్ర‌లు పోషించి ప్రేక్ష‌కుల‌ని అల‌రించిన అల్ల‌రి న‌రేష్ కొద్ది రోజులుగా మంచి స‌క్సెస్ అందుకోలేక‌పోతున్నాడు. ఇటీవ‌ల మ‌హ‌ర్షి చిత్రంలో మ‌హేష్ ఫ్రెండ్ పాత్ర‌లో న‌టించి అల‌రించాడు. ఇక ఆయ‌న న‌టిస్తున్న అల్ల‌రి బుల్లోడు చిత్రం త్వ‌ర‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. పూజా జ‌వేరి క‌థానాయికగా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌, అనీల్ సుంక‌ర సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా అల్ల‌రి న‌రేష్ త‌దుప‌రి ప్రాజెక్ట్‌కి సంబంధించిన వివ‌రాలు వెల్లడించారు. కాన్సెప్ట్ బేస్డ్ చిత్రంగా రూపొంద‌నున్న ఈ చిత్రాన్ని డెబ్యూ డైరెక్ట‌ర్ విజ‌య్ క‌న‌క‌మేడ‌ల తెర‌కెక్కించ‌నున్నాడు. స‌తీష్ వేగేశ్న‌, ఎస్‌వీ2 ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివ‌రాలు అతి త్వ‌ర‌లోనే వెల్ల‌డించ‌నున్నారు.

1024
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles