మ‌హ‌ర్షిలో అల్ల‌రి న‌రేష్ లుక్ ఔట్

Thu,February 7, 2019 01:01 PM

కెరీర్ తొలి నాళ్ళ‌లో హీరోగా వైవిధ్య‌మైన పాత్ర‌లు పోషించి ప్రేక్ష‌కుల‌ని అల‌రించిన అల్ల‌రి న‌రేష్ కొన్నాళ్ళుగా సరైన స‌క్సెస్ సాధించ‌డం లేదు. దీంతో స‌పోర్టింగ్ క్యారెక్ట‌ర్స్‌లో న‌టించేందుకు సిద్ధ‌మైన‌ట్టు తెలుస్తుంది. ప్ర‌స్తుతం వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న మ‌హ‌ర్షి సినిమాలో న‌టిస్తున్నాడు. ఇందులో మ‌హేష్ స్నేహితుడు ర‌వి పాత్ర‌లో క‌నిపించ‌నున్న‌ట్టు తెలుస్తుంది. మ‌హ‌ర్షి చిత్రంలో మ‌హేష్‌,పూజా హెగ్డే లుక్స్ బ‌య‌ట‌కి రాగా, అల్ల‌రి న‌రేష్ లుక్ ఎలా ఉంటుందా అనే దానిపై అభిమానుల‌లో అనేక సందేహాలు నెల‌కొన్నాయి. తాజాగా చిత్రానికి సంబంధించి డ‌బ్బింగ్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుతున్న క్ర‌మంలో అల్ల‌రి నరేష్ కూడా హాజ‌ర‌య్యాడు. చిత్ర యూనిట్‌తో క‌లిసి ఉన్న‌ అల్ల‌రి న‌రేష్‌కి సంబంధించిన ఫోటోలు కొన్ని బ‌య‌ట‌కి వ‌చ్చాయి. ఇందులో అల్ల‌రోడు భారీ గ‌డ్డంతో స‌రికొత్త లుక్‌లో క‌నిపిస్తున్నాడు. ఈ చిత్రం న‌రేష్‌కి టర్నింగ్ పాయింట్ అవుతుంద‌ని జోస్యాలు చెబుతున్నారు. చిత్రంలో మ‌హేష్ కాలేజ్‌ స్టూడెంట్‌గా, బిజినెస్‌ మేన్‌గా, మోడ్ర‌న్ రైతుగా క‌నిపిస్తాడని టాక్. దిల్‌రాజు, అశ్విని దత్‌, పీవీపీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.4469
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles