పాకిస్థాన్ నటీనటులపై జీవితకాల నిషేధం

Mon,February 18, 2019 01:43 PM

పుల్వామా దాడి నేపథ్యంలో ఆలిండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ ఓ సంచలన నిర్ణయం తీసుకున్నది. పాకిస్థాన్ నటీనటులను పూర్తిగా నిషేధించాలని నిర్ణయించింది. ఈ నిర్ణయంతో ఇక నుంచి బాలీవుడ్‌లో పాక్‌కు చెందిన ఆర్టిస్టులెవరూ కనిపించరు. నిజానికి 2016లో ఉరి దాడి జరిగినప్పటి నుంచే పాక్ నటీనటులపై నిషేధం విధించడం ప్రారంభించారు. అప్పట్లో పలువురు పాకిస్థాన్ నటులు ఉన్న సినిమాల విడుదలకు కూడా అడ్డంకులు ఏర్పడ్డాయి. తాజాగా పాక్ నటీనటులపై పూర్తి నిషేధించాలన్న నిర్ణయాన్ని నెటిజన్లు స్వాగతించారు. ఒకవేళ ఎవరైనా పాక్ కళాకారులను తీసుకుంటే.. వాళ్లపై కఠిన చర్యలు ఉంటాయని కూడా ఆలిండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ హెచ్చరించింది. ఈ ఉగ్ర దాడి తర్వాత దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమైన విషయం తెలిసిందే. ఇందులో సినిమా ఇండస్ట్రీ కూడా పాలుపంచుకుంది. ఒక రోజు పాటు అన్ని షూటింగ్‌లను నిలిపేసింది. ఈ నిరసన పాల్గొన్న బిగ్ బి అమితాబ్ బచ్చన్.. పుల్వామా దాడి అమరవీరుల కుటుంబాలకు ఆర్థిక సాయం కూడా అందించాడు.


6878
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles