గాయంతోనే షూటింగ్‌లో పాల్గొంటున్న అలియా

Wed,March 28, 2018 10:19 AM
alia gully boy shoot with injured shoulder

మ‌హేష్ భ‌ట్ గారాల ప‌ట్టి అలియా భ‌ట్ మార్చి 15న బ్ర‌హ్మాస్త్రా సెట్స్‌లో గ్రాండ్‌గా బ‌ర్త్‌డే సెల‌బ్రేష‌న్స్ జ‌రుపుకుంది. ఇది జ‌రిగి వారం కూడా కాక‌ముందే అలియాకి ఓ చేదు అనుభ‌వం ఎదురైంది. బ్ర‌హ్మాస్త్రా చిత్ర షూటింగ్‌లో అలియా గాయ‌ప‌డింది. యాక్ష‌న్ సీన్ తెర‌కెక్కిస్తున్న స‌మయంలో బ్యాలెన్స్ త‌ప్పి కింద ప‌డిన అలియా కుడి భుజానికి పెద్ద దెబ్బే త‌గిలింది. దీంతో వైద్యులు 15 రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాల‌ని సూచించార‌ట‌. అంతేకాదు క‌ట్టుని ఫుల్‌డే ఉంచుకోవాల‌ని అన్నార‌ట‌. కాని ఇవేమి ప‌ట్టించుకోని అలియా గ‌ల్లీభాయ్ షూటింగ్‌కి సిద్ధ‌మైంది. అలియా డెడికేష‌న్‌ని చూసి చిత్ర యూనిట్ ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేసింది. గల్లీ భాయ్ చిత్రం జోయా అక్త‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతుండ‌గా, ఇందులో ర‌ణ్‌వీర్‌, అలియా ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్నారు. వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వరిలో ఈ మూవీ విడుద‌ల కానుంది. అలియా న‌టించిన బ్ర‌హ్మాస్త్రా చిత్రం ఆగ‌స్ట్ 15న రిలీజ్ కానుంది. ఈ అమ్మ‌డు రాజీ, జీరో అనే సినిమాల‌తోను బిజీగా ఉంది.

1339
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles