త‌న కూతురిని వెండితెర‌కి ప‌రిచ‌యం చేస్తున్న‌ పూజా బేడీ

Tue,November 20, 2018 09:36 AM
alia farnicharwala debut movie  fixed

ఒక‌ప్పుడు ప్రేక్ష‌కుల‌ని త‌మ అంద‌చందాల‌తో ఉర్రూత‌లూగించిన భామ‌లు నేడు త‌మ వార‌సుల‌ని కూడా ఇదే రంగంలోకి దింపుతున్నారు. బాలీవుడ్ భామ పూజా బేడీ త‌న గారాల‌ప‌ట్టీ అలియా ఫ‌ర్నీచ‌ర్వాలాని జవానీ జానెమన్ సినిమా ద్వారా వెండితెర‌కి ప‌రిచ‌యం చేయ‌నుంది. ఈ చిత్రం తండ్రీ కూతుళ్ల అనుబంధానికి సంబంధించిన నేప‌థ్యంలో తెర‌కెక్క‌నుండ‌గా, ఇందులో సైఫ్ అలీఖాన్ తండ్రి పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటున్న ఈ చిత్రం అతి త్వ‌ర‌లోనే సెట్స్ పైకి వెళ్ళ‌నుంది. మూవీకి సంబంధించిన వివ‌రాలు కూడా అతి త్వ‌ర‌లోనే వెల్ల‌డించనున్నారు. మరి అలియా ఫ‌ర్నీచ‌ర్వాలా త‌న‌ సినీ కెరియ‌ర్‌ని త‌ల్లి మాదిరిగా అత్యున్న‌త స్థాయిలా ఉండేలా మ‌లుచుకోగ‌లుగుతుందా లేదా అనేది చూడాలి.

3204
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles