ఐఫా అవార్డ్స్: ఉత్త‌మ న‌టిగా అలియా, ఉత్త‌మ న‌టుడిగా ర‌ణ్‌వీర్

Thu,September 19, 2019 10:58 AM

గ‌త రాత్రి ఐఫా(ఇంటర్నేష‌న‌ల్ ఇండియ‌న్ ఫిలిం అకాడ‌మీ) అవార్డ్స్ ఘ‌నంగా జ‌రిగాయి. బాలీవుడ్ ప్ర‌ముఖ తారలంతా ఈ వేడుక‌కి హాజ‌రు కాగా, కార్య‌క్ర‌మం సంద‌డిగా జరిగింది. రాజీ చిత్రానికి గాను అలియా భ‌ట్ ఉత్త‌మ న‌టి అవార్డు అందుకోగా, ప‌ద్మావ‌త్‌లో అల్లావుద్దీన్ ఖిల్జీ పాత్ర‌ని అద్భుతంగా పోషించిన ర‌ణ్‌వీర్ సింగ్ ఉత్త‌మ న‌టుడి అవార్డు అందుకున్నారు. రాజీ, ప‌ద్మావ‌త్ చిత్రాల‌కి ఎక్కువ నామినేష‌న్ రాగా, ఉత్త‌మ చిత్రంగా రాజీ ఎంపికైంది. బెస్ట్ డైరెక్ట‌ర్‌గా శ్రీ రామ్ రాఘ‌వ‌న్ అవార్డు అందుకున్నారు. విక్కీ కౌశ‌ల్, అదితిరావు హైద‌రి బెస్ట్ స‌పోర్టింగ్ రోల్‌కి గాను అవార్డు తీసుకున్నారు.


ఐఫా అవార్డుల వేడుక కార్య‌క్ర‌మం 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా దీపికా ప‌దుకొణేకి స్పెష‌ల్ అవార్డ్ ఇచ్చారు. బ‌ర్ఫీ చిత్రానికి గాను ర‌ణ‌బీర్ క‌పూర్ స్పెష‌ల్ అవార్డ్ అందుకున్నారు. ఇక స్పెష‌ల్ అవార్డ్ కేటగిరీలో ఉత్త‌మ ద‌ర్శ‌కుడు అవార్డు రాజ్ కుమార్ హిరాణీకి ద‌క్కింది.


Best film - Raazi

Best Director - Sriram Raghavan (AndhaDhun)

Best Actress- Alia Bhatt (Raazi)

Best Actor - Ranveer Singh (Padmaavat)

Best Supporting Actress - Aditi Rao Hydari (Padmaavat)

Best Supporting Actor - Vicky Kaushal for (Sanju)

Best Debut Actor - Ishaan Khatter (Dhadak)

Best Debut Actress - Sara Ali Khan (Kedarnath)

Best Story - Sriram Raghavan, Pooja Ladha Surti, Arijit Biswas, Yogesh Chandekar and Hemanth Rao (AndhaDhun)

Best Music Direction - Amaal Mallik, Guru Randhawa, Rochak Kohli, Saurabh-Vaibhav and Zack Knight (Sonu Ke Titu Ki Sweety)

Best Lyrics - Amitabh Bhattacharya (Dhadak)

Best Playback Singer (Female) - Harshdeep Kaur and Vibha Saraf (Dilbaro from Raazi)

Best Playback Singer (Male) - Arijit Singh for (Ae Watan from Raazi)

Outstanding Contribution to Indian Cinema - Saroj Khan and Jagdeep

1151
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles