స‌ల్లూ స‌ర‌స‌న అలియా.. వ‌రుస ప్రాజెక్టుల‌తో బిజీ బిజీ

Tue,March 19, 2019 12:42 PM
Alia Bhatt to star opposite Salman Khan

బాలీవుడ్ యంగ్ భామ అలియా భ‌ట్ వ‌రుస ప్రాజెక్టుల‌తో బిజీ అవుతుంది. ప్ర‌స్తుతం బ్ర‌హ్మాస్త్రా చిత్రంతో పాటు క‌ళంక్, స్టూడెంట్ ఆఫ్ ది ఇయ‌ర్ 2, ఆర్ఆర్ఆర్ చిత్రాలు చేస్తుంది. తాజాగా మ‌రో ప్రాజెక్ట్‌లో తాను క‌థానాయిక‌గా ఎంపిక‌య్యానంటూ ట్వీట్ ద్వారా తెలిపింది. 9 ఏళ్ళ వ‌య‌స్సులో సంజ‌య్ లీలా భ‌న్సాలీ ఆఫీసుకి వెళ్ళాను. చాలా భ‌య‌పడ్డాను. ఆయ‌న త‌దుప‌రి సినిమాలో ఛాన్స్ రావాల‌ని దేవుడిని ప్రార్ధించాను. ఫైన‌ల్‌గా అది జ‌రిగింది. టీంతో క‌లిసేందుకు చాలా ఆస‌క్తితో ఎదురు చూస్తున్నాను అని అలియా స్ప‌ష్టం చేసింది.

సంజ‌య్ లీలా భ‌న్సాలీ, స‌ల్మాన్ ఖాన్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో తెర‌కెక్కుతున్న చిత్రానికి ఇన్షా అల్లా అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఇందులో అలియా భ‌ట్ క‌థానాయిక‌గా ఎంపికైంది. 1999 లో వ‌చ్చిన హ‌మ్ దిల్ దే చుకే స‌న‌మ్ అనే చిత్రం కోసం స‌ల్మాన్, సంజ‌య్ లీలా భ‌న్సాలీ క‌లిసి ప‌ని చేశారు. 20 ఏళ్ళ త‌ర్వాత వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో ప్రాజెక్ట్ రానుండ‌డంతో అభిమానుల‌లో ఆస‌క్తి నెల‌కొంది. అయితే సంజ‌య్ లీలా భ‌న్సాలీ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన సావ‌రియా(2007) చిత్రంలో స‌ల్మాన్ కామియోరోల్ పోషించాడు. ర‌ణ్‌బీర్ క‌పూర్ ప్ర‌ధాన పాత్ర పోషించారు.





1109
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles