బ‌న్నీతో సినిమా చేస్తానంటున్న బాలీవుడ్ భామ‌

Sat,December 15, 2018 08:47 AM
Alia Bhatt shows interest to made a movie with bunny

మ‌హేష్ భ‌ట్ గారాల ప‌ట్టి అలియా భ‌ట్‌.. ర‌ణ్‌బీర్‌తో ప్రేమాయణంకి సంబంధించి ఈ మ‌ధ్య ఎక్కువ‌గా వార్త‌ల‌లో నిలుస్తూ వ‌స్తుంది. ఆ మ‌ధ్య అలియా తండ్రి మ‌హేష్ వారిద్ద‌రు ప్రేమ‌లో ఉన్న విష‌యాన్ని క‌న్‌ఫాం చేశారు.ఇప్పుడు వారి పెళ్లి ఎప్పుడు జ‌ర‌గ‌నుంద‌నే విష‌యంపై అభిమాన‌లు ఆరాలు తీస్తున్నారు. అయితే అలియా తాజాగా త‌న అభిమానులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కి ట్విట్ట‌ర్ ద్వారా స‌మాధానాలు ఇచ్చింది. ఇందులో భాగంగా ఓ నెటిజ‌న్ అడిగిన ప్ర‌శ్నకి బదులుగా త్వ‌ర‌లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌తో క‌లిసి క‌చ్చితంగా సినిమా చేస్తాన‌ని పేర్కొంది. ప్ర‌స్తుతం తాను ర‌ణ్‌వీర్ సింగ్‌తో క‌లిసి గ‌ల్లీ బాయ్ అనే సినిమా చేస్తుంది. అలియా న‌టించిన బ్ర‌హ్మాస్త్రా చిత్రం వ‌చ్చే ఏడాది క్రిస్మ‌స్‌కి విడుద‌ల కానుంది.ఈ చిత్రంలో టాలీవుడ్ మ‌న్మ‌ధుడు నాగార్జున ఓ ముఖ్య పాత్ర పోషించిన విష‌యం విదిత‌మే.

2855
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles