ఈ రోజు చాలా చాలా సంతోషంగా ఉంది: అలియా

Thu,March 14, 2019 01:47 PM

టాలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్ ఆర్ఆర్ఆర్ మూవీకి సంబంధించి గ‌త కొన్ని రోజులుగా వ‌స్తున్న వార్త‌ల‌పై కొద్ది సేప‌టి క్రితం క్లారిటీ ఇచ్చాడు రాజ‌మౌళి. ఆర్ఆర్ఆర్ అనే టైటిల్‌తో అన్ని భాష‌ల‌లో ఈ చిత్రం విడుద‌ల కానుంద‌ని, చ‌ర‌ణ్ అల్లూరిగా క‌నిపిస్తే, ఎన్టీఆర్ కొమురం భీమ్‌గా క‌నిపించ‌నున్నార‌ని పేర్కొన్నాడు. ఇక చ‌ర‌ణ్ స‌ర‌స‌న అలియా భ‌ట్ క‌థానాయిక‌గా న‌టిస్తుండ‌గా, ఎన్టీఆర్‌కు జోడిగా విదేశీ భామ డైసీ ఎడ్జ‌ర్ జోన్స్‌ జోడి క‌ట్టిందిని, సముద్రఖ‌ని, అజ‌య్ దేవ‌గ‌ణ్‌ కీల‌క పాత్ర‌ల‌లో క‌నిపించ‌నున్నారని తెలియ‌జేశాడు. అయితే ఆర్ఆర్ఆర్ సంస్థ త‌మ ట్విట్ట‌ర్ ద్వారా మూవీలో అలియా భ‌ట్ న‌టిస్తుంద‌ని అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టిస్తూ మార్చి 15న బ‌ర్త్‌డే జ‌రుపుకోనున్న ఆమెకి అడ్వాన్స్ విషెస్ తెలిపింది.


ఈ ట్వీట్‌కి స్పందించిన అలియా ఈ రోజు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. భారీ తారాగ‌ణం, అతి పెద్ద టీంతో అంద‌మైన ప్ర‌యాణం ప్రారంభించ‌డానికి వేచి ఉండలేక‌పోతున్నాను. మీ ద‌ర్శ‌క‌త్వంలో గొప్ప అవ‌కాశం ఇచ్చినందుకు కృత‌జ్ఞ‌త‌లు అంటూ రాజ‌మౌళికి స్పెష‌ల్ థ్యాంక్స్ తెలిపింది అలియా. అయితే అస‌లు ఈ ప్రాజెక్ట్‌లో అలియా ఎంపిక ఎలా జ‌రిగింద‌నేది పాత్రికేయ‌లు స‌మావేశంలో వివ‌రించారు రాజ‌మౌళి. ఒక రోజు ముంబై నుండి వ‌స్తున్న స‌మ‌యంలో త‌న‌కి ఎయిర్ పోర్ట్‌లో అలియా క‌ల‌వ‌గా, అదే స‌మ‌యంలో ఆమెకి స్టోరీ వినిపించాను. వెంట‌నే తాను ఇందులో ఏ పాత్ర‌లోనైన న‌టించ‌డానికి ఓకే చెప్పిందని అన్నాడు. ఈ సినిమాలో న‌టించేందుకు ఆమె చాలా ఎగ్జైటింగ్‌గా కూడా ఫీలైంద‌ని జ‌క్క‌న్న ఈ సంద‌ర్బంగా పేర్కొన్నాడు.4012
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles