లైంగిక వేధింపుల విష‌యంలో న‌టికి నోటీసులు..!

Wed,April 25, 2018 12:13 PM
Ali Zafar sends legal notice to meesha

కొద్ది రోజుల నుండి సినీ ఇండ‌స్ట్రీలో కాస్టింగ్ కౌచ్‌పై పెద్ద ఎత్తున దుమారం రేగుతున్న సంగ‌తి తెలిసిందే. అన్ని ఇండ‌స్ట్రీలోని మ‌హిళలు ధైర్యంగా ముందుకొచ్చి తాము లైంగిక వేధింపుల‌కి గుర‌వుతున్నామంటూ చెప్పుకొస్తున్నారు. ఇటీవ‌లి కాలంలో ఇది చాలా హాట్ టాపిక్‌గా మారింది. అయితే మ‌న శతృదేశం పాకిస్థాన్‌లోను కాస్టింగ్ కౌచ్ ఉంద‌ని ఇటీవ‌ల వార్త‌లు వ‌చ్చాయి. ప్ర‌ముఖ న‌టి, సింగ‌ర్‌ మీషా ష‌ఫీ త‌న ట్విట్ట‌ర్‌లో పాక్ గాయ‌కుడు, న‌టుడు అలీ జాఫ‌ర్ త‌న‌ని లైంగికంగా వేధించాడ‌ని, తాక‌రాని చోట తాకాడ‌ని చెప్పుకొచ్చింది. మీటూ క్యాంపెయిన్ ఇంత భారీ స్థాయిలో జ‌రుగుతున్న క్ర‌మంలో నేను లైంగిక వేధింపు గురించి మాట్లాడాల్సి వ‌చ్చింది. ఇద్ద‌రు పిల్ల‌ల త‌ల్లని తెలిసి కూడా జ‌ఫ‌ర్ నాతో మిస్ బిహేవ్ చేశాడు. రేపు మ‌రో అమ్మాయికి ఇలా జ‌ర‌గ‌కూడ‌దనే నేను బ‌య‌ట‌కి వ‌చ్చానంటూ త‌న ఆవేద‌న‌ని ట్వీట్ ద్వారా తెలిపింది మీషా.

మీషా ట్వీట్‌పై వెంట‌నే రెస్పాండ్ అయిన అలీ జ‌ఫ‌ర్ నేను ఎంటో నా సన్నిహితులు, శ్రేయోభిలాషుల‌కి తెలుసు. నేను ఓ పాప‌కి తండ్రిని. మీటూ ఉద్య‌మానికి మ‌ద్ధ‌తిస్తాను. కాని నాపై ఇలాంటి త‌ప్పుడు విమ‌ర్శ‌లు చేయ‌డం క‌రెక్ట్ కాదు. దీనిపై మౌనంగా ఉండటం ఏమాత్రం మంచిది కాదు. అందుకే న్యాయ‌ప‌ర‌మైన చ‌ర్య‌ల‌కి రెడీ అవుతున్నానంటూ అలీ త‌న ట్వీట్ ద్వారా తెలిపిన సంగ‌తి తెలిసిందే. అయితే త‌న‌పై త‌ప్పుడు ఆరోపణలు చేసినందుకు మిషా క్షమాపణ చెప్పాలని, లేకపోతే రూపాయలు 100 మిలియన్ల (భారత కరెన్సీలో రూ. 6 కోట్ల) పరువునష్టం దావా వేస్తానని అలీ జ‌ఫ‌ర్ హెచ్చరించారు. వెంట‌నే త‌ప్పుడు ట్వీట్స్‌ని డిలీట్ చేయాల‌ని కూడా ఆయ‌న డిమాండ్ చేశారు. రెండు వారాల‌లోగా క్ష‌మాప‌ణ చెప్ప‌క‌పోతే మీషాపై పోలీసు కేసు న‌మోదు చేస్తాన‌ని జాఫ‌ర్ అన్నాడ‌ట‌. అయితే జాఫర్ ఇచ్చిన నోటీసులు తన క్లయింట్‌కు అందలేదని మిషా లాయర్‌ తెలిపారు.

4011
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles