పాక్ నటి మీషాపై అలీజాఫర్ పరువు నష్టం దావా

Mon,June 25, 2018 05:36 PM
Ali zafar filed Defemation suit on Meesha shafi

పాకిస్థాన్ నటుడు, గాయకుడు, పెయింటర్ అలీజాఫర్ నటి, మోడల్, గాయని మీషా షఫీపై పరువు నష్టం దావా వేశాడు. రెండు నెలల క్రితం మీషా షఫీపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు తనపై ఆరోపణలు చేయడంతో అలీజాఫర్ జిల్లా కోర్టులో దావా వేశాడు. మీసా షఫీ సామాజిక మాధ్యమంలో లైంగిక వేధింపుల విషయాన్ని తెలియజేస్తూ పోస్ట్ చేసిన కామెంట్స్‌తో తన పరువు ప్రతిష్టలకు తీవ్రమైన నష్టం కలిగిందని అలీ జాఫర్ పేర్కొన్నాడు.

అభ్యంతరకరమైన, తప్పుడు ఆరోపణలతో మీసా తన కీర్తి ప్రతిష్టలు, గౌరవాన్ని దెబ్బతీసిందని ఆర్డినెన్స్ 2002 కింద దాఖలు చేసిన పరువు నష్టం దావా పిటిషన్‌లో పేర్కొన్నాడు. మీసా షఫీ తప్పుడు సందేశంతో తనకు రూ.100 కోట్ల మేర నష్టం జరిగిందని అలీజాఫర్ తెలిపాడు. వ్యక్తిగతంగా నాపై లైంగిక ఆరోపణలు రావడం వల్లే ఈ విషయాన్ని అందరితో షేర్ చేసుకుంటున్నా. ఈ అంశంపై మాట్లాడటం అంత సులభం కాదని..అయితే ఈ విషయానికి సంబంధించి నిశ్శబ్దంగా ఉండటం చాలా కష్టమైన పని అని ట్విట్టర్ ద్వారా తన అభిప్రాయాన్ని చేసుకుంది మీషా షఫీ. ఇదిలా ఉంటే అలీజాఫర్ దావాపై జులై 5 లోగా వివరణ ఇవ్వాలని కోర్టు మీసా షఫీకి నోటీసులు జారీచేసింది.
1698
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles