లైంగికంగా వేధించాడ‌ని న‌టుడిపై సింగ‌ర్ ఆరోప‌ణ‌

Fri,April 20, 2018 10:16 AM
Ali Zafar accused of sexual harassment by  Meesha Shafi

మేటి ప్రొడ్యూసర్ హార్వే వెయిన్‌స్టిన్ లైంగికంగా వేధిస్తున్నాడ‌ని ఆరోపణలు రావ‌డంతో హాలీవుడ్‌లో యావత్ ఫిల్మ్ ఇండస్ట్రీ ప‌లు నిర‌స‌న‌లు చేసిన‌ సంగ‌తి తెలి సిందే. అదే స‌మ‌యంలో వెయిన్‌స్టిన్‌కు వ్యతిరేకంగా ట్విట్టర్‌లో మీ టూ ఉద్యమం కూడా వెల్లువెత్తింది. అయితే ఈ సంఘ‌ట‌న త‌ర్వాత ఒక్క హాలీవుడ్‌లోనే కాదు బాలీవుడ్‌, టాలీవుడ్‌, కోలీవుడ్ సినీ ప‌రిశ్ర‌మ‌లోని మ‌హిళ‌లు లైంగిక వేధింపుల‌పై ఓపెన్ అవుతున్నారు. ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో కాస్టింగ్ కౌచ్ ఉద్య‌మం తీవ్ర‌స్థాయిలో జ‌రుగుతుంది. ఇక మ‌న శతృదేశం పాకిస్థాన్‌లోను కాస్టింగ్ కౌచ్‌కి బీజం ప‌డింద‌ని చెప్ప‌వ‌చ్చు. ప్ర‌ముఖ గాయ‌ని మీషా ష‌ఫీ త‌న ట్విట్ట‌ర్‌లో పాక్ న‌టుడు అలీ జాఫ‌ర్ త‌న‌ని లైంగికంగా వేధించాడ‌ని, తాక‌రాని చోట తాకాడ‌ని చెప్పుకొచ్చింది. మీటూ క్యాంపెయిన్ ఇంత భారీ స్థాయిలో జ‌రుగుత‌న్న క్ర‌మంలో నేను లైంగిక వేధింపు గురించి మాట్లాడాల్సి వ‌చ్చింది. ఇద్ద‌రు పిల్ల‌ల త‌ల్లని తెలిసి కూడా జ‌ఫ‌ర్ నాతో మిస్ బిహేవ్ చేశాడు. రేపు మ‌రో అమ్మాయికి ఇలా జ‌ర‌గ‌కూడ‌దనే నేను బ‌య‌ట‌కి వ‌చ్చానంటూ త‌న ఆవేద‌న‌ని ట్వీట్ ద్వారా తెలిపింది మీషా. అయితే గాయ‌ని ట్వీట్‌పై వెంట‌నే రెస్పాండ్ అయిన అలీ జ‌ఫ‌ర్ నేను ఎంటో నా సన్నిహితులు, శ్రేయోభిలాషుల‌కి తెలుసు. నేను ఓ పాప‌కి తండ్రిని. మీటూ ఉద్య‌మానికి మ‌ద్ధ‌తిస్తాను. కాని నాపై ఇలాంటి త‌ప్పుడు విమ‌ర్శ‌లు చేయ‌డం క‌రెక్ట్ కాదు. దీనిపై మౌనంగా ఉండటం ఏమాత్రం మంచిది కాదు. అందుకే న్యాయ‌ప‌ర‌మైన చ‌ర్య‌ల‌కి రెడీ అవుతున్నానంటూ అలీ త‌న ట్వీట్ ద్వారా తెలిపాడు. బాలీవుడ్‌లో తెరె బిన్‌ లాడెన్‌, మేరీ బ్రదర్‌ కీ దుల్హన్‌, డియర్‌ జిందగీ తదితర చిత్రాలతో న‌టించాడు అలీ జ‌ఫ‌ర్‌.3430
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles