నాలుగోవారం కెప్టెన్సీ పీఠాన్ని ద‌క్కించుకుంది ఎవ‌రో తెలుసా ?

Thu,August 15, 2019 08:08 AM
Ali, Rahul, and Ravi buckle up for the last leg of the captaincy task

బిగ్ బాస్ సీజ‌న్3 ఎపిసోడ్ 25 ప‌ద్మావ‌త్ లోని ఖ‌లీ బ‌లీ సాంగ్‌తో మొద‌లైంది. అంద‌రు పాట‌కి త‌గ్గ‌ట్టు స్టెప్పులు వేస్తూ ప్రేక్ష‌కుల‌ని ఆనందింపజేశారు. ఆ త‌ర్వాత శ్రీముఖి, రోహిణి, హిమ‌జ ఓ చోట కూర్చోని ముచ్చ‌టిస్తున్న స‌మ‌యంలో శ్రీముఖి.. నా ఎనాల‌సిస్ ప్ర‌కారం ఈ వారం నువ్వు వెళ్లిపోతావేమో అని రోహిణితోఅంది. ఈ మాట మొహం మీదే చెప్పేస‌రికి రోహిణి హ‌ర్ట్ అయింది. ఫ్రెండ్‌వి అయ్యిండి మొహం మీద అంటే ఎంత బాధ‌గా ఉంటుంది. అయిన నేను ఎలిమినేట్ అవుతా అని నువ్వు ఎలా చెప్ప‌గ‌ల‌వు. ఎలిమినేట్ అవుతావేమో అనడం వేరు.. నువ్వు కచ్చితంగా వెళ్లిపోతావ్ అని చెప్పడం వేరు’’ అంటూ రోహిణి క‌న్నీటి ప‌ర్యంతం అయింది.

నేను అన్న వ‌ర్షెన్ వేరు నువ్వు అనుకున్న‌ది వేరు అంటూ రోహిణిని శ్రీముఖి ఓదార్చే ప్ర‌యత్నం చేసిన‌ప్ప‌టికి ఆమె క‌ర‌గ‌లేదు. పున‌ర్న‌వి మ‌ధ్య‌లో క‌ల‌గ‌జేసుకొని రోహిణిని కాస్త రెచ్చ‌గొట్టింది. ఈ విష‌యం తెలుసుకున్న శ్రీముఖి మూడో ప‌ర్స‌న్ మా మ‌ధ్య అవ‌స‌రం లేదు. మా ప్రాబ్ల‌మ్ మేము సాల్వ్ చేసుకుంటామ‌ని అంది. ఆ త‌ర్వాత అషూ కూడా శ్రీముఖి వ్యాఖ్య‌ల‌ని త‌ప్పు ప‌ట్టింది. ఇలా కొద్ది సేపు చ‌ర్చ‌లు జ‌రిగిన త‌ర్వాత శ్రీముఖి ..రోహిణికి క్ష‌మాప‌ణ చెప్పింది.దీంతో వివాదం స‌ద్దుమ‌ణిగింది. ఇక గ‌త ఎపిసోడ్‌లో నేనే రాజు నేనే మంత్రి కెప్టెన్స్ టాస్క్ మొద‌టి లెవ‌ల్ పూర్తి కాగా రెండో లెవ‌ల్ హంగామా ఎపిసోడ్ 25లో చూపించారు.

రెండో లెవ‌ల్‌లో డ్రాగన్స్‌గా ఉన్న ర‌వికృష్ణ‌, అలీ రాజా, రాహుల్‌ల‌లో ఒక‌రు గార్డెన్ ఏరియాలో ఉన్న సింహాస‌నాన్ని అధిరోహిస్తారో వారే ఈ వారం ఇంటి కెప్టెన్ అవుతార‌ని బిగ్ బాస్ ఆదేశించారు. అయితే ఈ లెవ‌ల్‌లో మిగ‌తా ఇంటి స‌భ్యులు త‌మకి న‌చ్చిన డ్రాగన్స్‌కి స‌పోర్ట్ చేయ‌వ‌చ్చు, న‌చ్చ‌ని వాళ్ళ‌ని సింహాస‌నం నుండి లాగేయోచ్చు అని తెలియ‌జేశారు. ఎండ్ బ‌జ‌ర్ వ‌ర‌కు సింహాసనంపై ఎవ‌రైతే ఉంటారో వారే ఇంటి కెప్టెన్ అవుతారని బిగ్ బాస్ పేర్కొన్నారు. స్టార్ట్ బ‌జ‌ర్ మోగిన వెంట‌నే అలీ రాజా సింహాస‌నంపై కూర్చున్నాడు. అత‌నికి స‌పోర్ట్‌గా శ్రీముఖి, హిమ‌జ‌, బాబా బాస్క‌ర్ ఉన్నారు. సింహాస‌నం నుండి అలీని లాగేయ‌కుండా వారు అడ్డుకున్నారు.

అలీని దించడానికి రాహుల్ అండ్ టీం, ర‌వికృష్ణ విశ్వ ప్ర‌య‌త్నాలు చేసిన అది సాధ్యం కాలేదు. ఎండ్ బజర్ మోగేసరికి అలీ సింహాసనంలో ఉన్నాడు. దీంతో అతన్ని బిగ్ బాస్ నాలుగోవారం కెప్టెన్‌గా ప్రకటించారు. ఆ త‌ర్వాత పున‌ర్న‌వి, అషూ, శ్రీముఖి, రాహుల్ ఇంటి స‌మ‌స్య‌ల‌ని కెప్టెన్ వ‌ద్ద‌కి తీసుకెళ్ళ‌గా, ఆయ‌న వాటికి స‌రైన పరిష్కారం ఇవ్వ‌డంతో అంద‌రు అలీ రాజా కి జై అంటూ నినాదాలు చేశారు. ఇక శ్రీముఖి ప‌ర్స‌న‌ల్ కెరీర్ గురించి మొద‌ట్లో త‌ప్పుగా మాట్లాడిన రాహుల్.. ఆమె ద‌గ్గ‌ర‌కి వెళ్లి సారీ చెప్పాడు. న‌న్ను క్ష‌మిస్తావా లేదా అనేది నీ నిర్ణయం అని రాహుల్ చెప్పుకొచ్చాడు. ఆ త‌ర్వాత మ‌హేష్ గురించి కాసేపు పున‌ర్నవి, వితికా, రాహుల్‌, వ‌రుణ్‌లు చ‌ర్చించారు. దీంతో 25వ ఎపిసోడ్‌కి ఎండ్ ప‌డింది.

1536
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles